• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » మల్లారెడ్డికే ఎందుకిలా..?

మల్లారెడ్డికే ఎందుకిలా..?

Published on December 19, 2022 by sasira

Advertisement

ఐటీ అధికారుల రెయిడ్స్ తో ఈమధ్య బాగా వార్తల్లో నలిగింది మల్లారెడ్డి పేరు. ఆయన సంస్థుల, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు జరగడం.. ఆ తర్వాత నోటీసులు ఇవ్వండి.. విచారణ జరగడం.. ఇలా ఎపిసోడ్స్ వారీగా మల్లారెడ్డి చుట్టూ వార్తలు తిరిగాయి. తాజాగా మరోమారు మల్లారెడ్డి పేరు మార్మోగుతోంది. ఈసారి సోదాల విషయంలో కాదులేండి. సొంత పార్టీ నేతల అసమ్మతి స్వరంతో మల్లారెడ్డి వార్తల్లో నిలిచారు.

దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో కొందరు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు మల్లారెడ్డిని ఓ ఆటాడుకున్నారు.

Advertisement

తమ కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అందరికి అవకాశం ఇవ్వలేకపోయామని.. ఒక్క నియోజకవర్గానికే పదవులు ఇస్తే ఎలా అని మల్లారెడ్డిపై ఫైరయ్యారు నేతలు. ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉన్నామని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని, కానీ తొందరపడి జీవో ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement

ఈ భేటీపై మల్లారెడ్డి స్పందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమైన విషయం గురించి తెలుసుకుంటానని తెలిపారు. తాను పదవులను తన్నుకుపోలేదన్నారు. మార్కెట్ కమిటీకి సంబంధించి సమస్య లేనేలేదని.. అది పాత జీవో అని చెప్పారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో తనకు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల భేటీపై హైకమాండ్‌ స్పందించింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధి ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd