Advertisement
పెద్దలు మనకు ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఇంట్లో వాస్తు నుంచి ప్రయాణాలు, ఎప్పుడూ ఎలాంటి కార్యాలు మొదలుపెట్టాలో… ఇలా ఎన్నో విషయాలు మనకు పెద్దలు చెబుతుంటారు. అయితే, శాస్త్రం ప్రకారం ఇతరుల దగ్గర ఏమైనా వస్తువులు తీసుకుంటే దానికి ప్రతికూల శక్తి మనలోకి వస్తుందట. దీనివల్ల కొద్దిరోజుల తర్వాత అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటో చూద్దామా.
Advertisement
# ఉంగరం
వాస్తు శాస్త్రంలో మరొకరి ఉంగరాన్ని ధరించడం కూడా ఆశుభం. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం, జీవితం, ఆర్థిక రంగంపై చెడు ప్రభావం పడుతుంది.
READ ALSO : The Kerala story movie review in Telugu “ది కేరళ స్టోరీ” సినిమా రివ్యూ & రేటింగ్
# దుస్తువులు
Advertisement
మనం ఎప్పుడైనా ఇతరుల దుస్తులు తీసుకోకూడదు. ఎందుకంటే వారి దుస్తులు ధరించినప్పుడు వారి యొక్క నెగటివ్ ఎనర్జీతో పాటుగా వారి శరీరంలోని బ్యాక్టీరియాలు కూడా తీసుకున్న వారిలో చేరతాయి.
# వాచ్
వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఎవరి దగ్గర నుంచి అయినా వాచ్ ను తీసుకోరాదు. ఎందుకంటే మానవ జీవితం సమయంతో ముడిపడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తిపై చెడు ప్రభావాన్ని కలిగి ఉండే సమయంలో అతని గడియారాన్ని తీసుకుంటే వారి చెడు సమయం మన జీవితంలోకి వస్తుంది.
# పాదరక్షలు
వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పేదరికం ఉంది అంటే, శని స్థానం పాదాలలో ఉందని అంటారు. అందుకే ఇతరుల పాదరక్షలు మనం తీసుకుంటే వారి శని మనకు వచ్చే అవకాశం ఉంటుంది.
READ ALSO : హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఏవంటే…?