Advertisement
Veerasimhareddy Review Telugu: ప్రస్తుతం బాలయ్య బాబు వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇక ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Veerasimhareddy Movie Review and Rating in Telugu

Veerasimhareddy Movie Review in Telugu
Veerasimhareddy Movie Story in Telugu: కథ:
వీరసింహ రెడ్డి కథ టర్కీ ఇస్తాంబుల్ లో మొదలవుతుంది. జై (బాలయ్య), ఈశా (శృతిహాసన్) ల పరిచయం అక్కడే అవుతుంది. అయితే ఏపీలో వీరసింహారెడ్డి (బాలయ్య) కథ నడుస్తూ ఉంటుంది. ఓసారి వీరసింహారెడ్డి టర్కీకి వస్తాడు. అసలు జై టర్కిలో ఎందుకు ఉంటాడు? వీర సింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వీర సింహారెడ్డి, జై లు ఎందుకు వేరువేరుగా ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశాలు.
వీర సింహారెడ్డి పాత్రకు ప్రాణం పోసినట్టుగా బాలకృష్ణ నటించాడు. ప్రతి సన్నివేశంలో కూడా ఆయన డైలాగ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. అద్భుతమైన బాలయ్య నటనకు ఫ్యాన్స్ మైమరచిపోవడం ఖాయం. శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆమె కామెడీ సన్నివేశాలు ఎబెట్టుగా అనిపించాయి. సినిమాలో బాలయ్య తర్వాత ప్రధాన ఆకర్షణ. వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె పాత్ర సినిమా కథలో అత్యంత కీలకమవ్వడంతో తన నటనతో మెప్పించింది. ఇక హాని రోజ్ ఉన్నంతలో ఆకట్టుకుంది. మంచి నటనతో మెప్పించింది. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు.
Advertisement
దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త వర్కౌట్ చేస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపించింది. హీరో యొక్క పాత్ర పై శ్రద్ధ పెట్టినట్టుగా ఇతర విషయాలపై కూడా దర్శకుడు శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే కచ్చితంగా మంచి అవుట్ ఫుట్ దక్కేది. ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. తమన్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది.
ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా కావడం
తమన్ సంగీతం
మేకింగ్ వేల్యూస్
గోపీచంద్ మలినేని దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
పాతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
రేటింగ్: 3/5
Advertisement
READ ALSO : అజిత్ తెగింపు రివ్యూ ? అజిత్ తెలుగు లో హిట్ కొట్టాడా ?