Advertisement
ఈరోజు దేశవ్యాప్తంగా సీతారాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చాలా పుణ్యక్షేత్రాలలో సీతారాముల కల్యాణాన్ని వేద మంత్రాల మధ్య నిర్వహించారు.. సాధారణంగా శ్రీ రామనవమి రోజున సీతారాములకు మాత్రమే కళ్యాణం చేయడం మనం ఇప్పటివరకు చూసాం.. కానీ ఈ రోజే సీతారాములతోపాటు హిజ్రాలకు కూడా పెళ్లి చేస్తారట.. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రం చాలా ఫేమస్.. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం చాలా వైభవోపేతంగా నిర్వహిస్తారు.
also read: రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
కానీ ఇక్కడి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది… చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర యుక్తమైన అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని వైష్ణవాలయాల్లోనే కాకుండా అనేక శివాలయాల్లో కూడా జరుపుకోవడం చాలా వరకు ఆనవాయితీగా వస్తుంది. శివకేశవుల మధ్య అబివాధాన్ని పాటిస్తూ ఆ రాముడికి ఉత్సవాలను జరపడం ఇక్కడి విశేషం. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుండగానే, మరోవైపు జోగినీలు శివుడే వారి నాధుడిగా భావించి వివాహం చేసుకుంటారు.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 30.03.2023
ఉదయం పూట రాజన్న ఆలయంలో ఉన్న గుండంలో స్నానాలు ఆచరించి, తర్వాత శివున్ని దర్శించుకుని రాముల వారి కళ్యాణం జరిగే స్థలానికి వెళ్తుంటారు. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి జోగినిలు అందంగా ముస్తాబై వచ్చి పెళ్లి పీటలు ఎక్కుతారు. పట్టు వస్త్రాలను ధరించి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని, సీతారాముల కళ్యాణం జరిగే సన్నిధికి చేరుకొని సీతారాముల వారికి కళ్యాణం జరిగే సమయంలో శివుడు తమను వివాహం చేసుకున్నట్లు భావించుకొని ఒకరిపై మరొకరు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. దీని తర్వాత వీరి వివాహమైనట్టు భావిస్తారు. ఈ విధంగా శ్రీరామనవమి రోజున శివయ్యను వివాహం చేసుకుంటారు.
Advertisement
also read:Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?