Advertisement
Vettaiyan Review: జ్ఞానవేలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా, రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. మనసిలాయే పాట ఈ సినిమా నుంచి వచ్చి బాగా వైరల్ అయింది. హీరోయిన్ మంజు వారియర్ వేసిన స్టెప్స్ ఎన్నో రీల్స్ చేసేలా చేసింది.
Advertisement
దర్శకత్వం: టీజే జ్ఞానవేల్
నటులు: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్,
దుషార విజయన్
సినిమాటోగ్రఫీ: SR కతీర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
రిలీజ్ డేట్: 10-10-2024
కథ మరియు వివరణ:
కథ విషయానికి వచ్చేస్తే.. రజినీకాంత్ పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనబడ్డారు ముఖ్యంగా సిటీలో జరుగుతున్న కొన్ని మర్డర్ మిస్టరీలను సాల్వ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతారు. అయితే ఈ క్రమంలో ఆయనకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. హంతకుడిని పట్టుకుని కోర్టులో సబ్మిట్ చేశారా..? ఆ హంతకుడు ఎవరు అతని మోటివ్ ఏంటీ అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. రజినీకాంత్ మీద ఆయన రాసుకున్న సీన్స్ థియేటర్లో ప్రేక్షకులని ఇంప్రెస్ చేశాయి. రజనీకాంత్ చెప్పిన డైలాగ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
Advertisement
జ్ఞానవేల్ సక్సెస్ఫుల్గా డీల్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. సూర్యతో చేసిన జై భీమ్ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని ఈజీగా ప్రేక్షకులకు నచ్చే విధంగా కన్వే చేసిన విధానం ప్రేక్షకులందరికీ కూడా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా మార్చడంలో ఎంతో అద్భుతంగా సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ వంటి స్టార్ హీరోని పెట్టుకుని మాస్ మసాలా కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాని చేయడం అనేది గొప్ప విషయం అనిరుధ్ అందించిన మ్యూజిక్ కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో హెల్ప్ అయ్యింది. ఆర్టిస్టులు కూడా ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు అద్భుతంగా నటించారు. రజనీకాంత్ స్వాగ్, స్టైల్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. అమితాబ్ బచ్చన్ కూడా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ అంశాల గురించి చూస్తే మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.
Also read:
ప్లస్ పాయింట్స్
స్టోరీ
రజనీకాంత్
మ్యూజిక్
మైనస్ పాయింట్లు
అక్కడక్కడ కొన్ని సీన్లు
ల్యాగ్ అవ్వడం
మొదట్లో కథ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం
రేటింగ్ 2.5/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!