Advertisement
జైలర్ సినిమాతో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసారు రజినీకాంత్. ఆయన స్టార్ డమ్ ఏంటనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హీరోగా రూపొందించిన మరో సినిమా వెట్టయన్ ది హంటర్. జై భీమ్ తో ఆకట్టుకున్న జ్ఞానవేలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా, రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. మనసిలాయే పాట ఈ సినిమా నుంచి వచ్చి బాగా వైరల్ అయింది. హీరోయిన్ మంజు వారియర్ వేసిన స్టెప్స్ ఎన్నో రీల్స్ చేసేలా చేసింది.
Advertisement
Advertisement
తమిళంలో కొంతమంది సినీ ప్రముఖులకు ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు. ఇక టాక్ చూసినట్లయితే ఎస్పీ అజిత్ కుమార్ సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసి హత మారుస్తూ ఉంటాడు. డీసీపీ సత్యదేవ (అమితాబ్ బచ్చన్) నుంచి ఒత్తిడి ఎదురైనా అతను తగ్గడు. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి.
Also read:
మనసిలాయే సాంగ్ ని బాగా పిక్చరైజ్ చేసినట్టు తెలుస్తోంది. మంజు వారియర్ కూడా బాగా నటించారు. జై భీమ్ మాదిరి సోషల్ మెసేజ్ ఉంటుంది. కొన్ని సీన్లు చాలా సహజంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ అవుతుందని అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!