Advertisement
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం వేట్టయన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జ్ఞానవేలు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మూవీ తొలి రోజు కలెక్షన్స్ లో రికార్డును నెలకొంది. టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదల అయ్యి అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన చిత్రాల్లో రెండవ సినిమాగా ఇది నిలిచింది.
Advertisement
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లను వసూలు చేసింది అని తెలుస్తోంది. ఈ ఏడాది వచ్చిన తమిళ్ సినిమాలో ది గోట్ ప్రధమ స్థానంలో ఉండగా.. ఈ సినిమా రెండవ స్థానంలో నిలిచింది. రజినీకాంత్ ని బెస్ట్ గా చూపించారని దర్శకుడుని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Advertisement
Also read:
మంచి సక్సెస్ సాధించడం పై రజినీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. అనిరుద్ కూడా మంచి సంగీతాన్ని అందించారు. మొత్తానికి మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనిని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదములు అని సౌందర్య రజనీకాంత్ పోస్ట్ కూడా చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!