Ads
Venkatesh Wife Neeraja Reddy: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ… మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడ మాట్లాడాడు. అలాగే వెంకటేష్ భార్య గురించి గానీ, పిల్లల గురించి, గాని పెద్దగా విషయాలు కూడా బయటికి రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరు కారు.

Venkatesh Wife Neeraja Reddy
అలాగే వెంకటేష్ భార్య గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. వెంకటేష్ పెళ్లి కోసం రామానాయుడు సంబంధాలు చూసినపుడు డబ్బు, కులం పట్టింపు లేకుండా అమ్మాయి గుణగణాలకే ప్రాముఖ్యతను ఇచ్చి చాలా సంబంధాలను చూశారట. ఆ సమయంలో టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డి గారు ఒక సంబంధం చెప్పారట. నాగిరెడ్డి గారి బంధువు మదనపల్లెకు చెందిన సుబ్బారెడ్డి గారి అమ్మాయి నీరజ గురించి రామానాయుడికి చెప్పారట ఆ సంబంధం రామానాయుడు, వెంకటేష్ లకు నచ్చటంతో 13 డిసెంబర్ 1987 న నీరజ ను వివాహం చేసుకున్నారు వెంకటేష్.. చెన్నైలో విజయ శేషమహల్ లో వెంకటేష్, నీరజ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
Advertisement
Also Read: Kabja Movie Dialogues in Telugu: కబ్జా డైలాగ్స్
ఆ పెళ్లికి సినీ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరు అయ్యి దంపతులను ఆశీర్వదించారు. ఇక నీరజ తండ్రి సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ నీరజ తల్లి గారు వ్యాపారాన్ని చూసుకుంటారు. జీవితం ఆనందంగా ఉండాలంటే డబ్బు, హోదా కంటే పద్ధతి, అనుకువ ఉండాలని అర్థం చేసుకున్న రామానాయుడు వెంకటేష్ కి నీరజ ను ఇచ్చి వివాహం చేశారు. రామానాయుడు తీసుకున్న నిర్ణయం 100కు 100% కరెక్ట్ అని వెంకటేష్ దంపతులు నిరూపించారు.