Advertisement
కల్వకుంట్ల కవిత ఓపెనింగ్ వికెట్ పడబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయశాంతి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని… టిఆర్ఎస్ బండారం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరు…మునుగోడు లో బిజేపీ గెలవబోతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది…శాంతియుతంగా, ప్రజాస్వామ్య యుతంగా పాదయాత్ర జరుగుతుందని ఆగ్రహించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాదయాత్ర పై దాడులు చేస్తున్నారు…ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బండి సంజయ్ పాదయాత్ర పై దాడికి తెగ బడ్డారని నిప్పులు చెరిగారు.
Advertisement
సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం… టిఆర్ఎస్ చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు బిజేపీ వైపు చూస్తున్నారు… అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పాదయాత్ర యధావిధిగా అనుమతి ఇవ్వాలి, జరిగిన ఘటనపై విచారణ జరపాలి… ఎట్టి పరిస్థితిలో పాద యాత్ర జరిగి తీరుతుందని స్పష్టం చేశారు విజయశాంతి.
Advertisement
ఇవి కూడా చదవండి: చిన్న వయసులో భర్తలను కోల్పోయిన నటీమణులు..!