Advertisement
Vikram Cobra Movie Review:: విక్రమ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. తమిళంలో సమానంగా ఇక్కడ కూడా విక్రమ్ కు మంచి క్రేజ్ ఉంది. ఈయన సినిమాలకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే థియేటర్లో ఈయన సినిమా విడుదలై మూడేళ్లు అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా, అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది మహానటి విడుదలైన అది నేరుగా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం ఈయన నటించిన కోబ్రా విడుదలకు సిద్ధంగా ఉంది.
Advertisement
Vikram Cobra Movie Review:
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఇక్కడ రిలీజ్ కాకముందే, ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దుబాయ్ క్రిటిక్ మెంబర్, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సందు ఈ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విక్రమ్ నుంచి ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు.
Advertisement
యాక్షన్ సీన్లు, ఇతర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ఉమైర్ చెప్పాడు. విక్రమ్ గెటప్పులు కూడా అదిరిపోతాయట. యాక్షన్ సీన్లు అయితే విజువల్ ఫిస్ట్ గా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్ లో తెరకెక్కించారట. హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కోసం ఆమె అభిమానులు కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో డైరెక్షన్ టెర్రిఫిక్ గా ఉందని ఉమైర్ చెప్పాడు. ప్రొడక్షన్ డిజైన్, క్లైమాక్స్ అద్భుతం అని నా రేటింగ్ 3.5 అని చెప్పాడు. రివ్యూ వల్ల కోబ్రా పై అంచనాలు భారీగానే ఉన్న, ఇటీవల అతడు డిజాస్టర్ సినిమాలు కూడా సూపర్ అని చెప్పడంతో కొంత సందేహాలు కూడా ఉన్నాయి.