• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » ‘టెంపర్’ సినిమాలో పోసాని పాత్రలో ముందు అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ? ఎందుకు రిజెక్ట్ చేసారంటే ?

‘టెంపర్’ సినిమాలో పోసాని పాత్రలో ముందు అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ? ఎందుకు రిజెక్ట్ చేసారంటే ?

Published on January 12, 2023 by karthik

Advertisement

2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్, అలీ, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రంలో నటించిన మరో ప్రధాన పాత్ర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మూర్తి అనే కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర సినిమాకి హైలెట్ అయింది.

Read also: అదేంటి చిరు గారు అలా అనేసారు? కిరణ్‌ అబ్బవరం మనసును బాధపెట్టిందిగా!

Advertisement

ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. హీరోను మార్చే క్యారెక్టర్లలో ఈ పాత్ర కూడా ఒకటి. అయితే ఇంతటి ముఖ్యమైన పాత్రకి దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుగా అనుకున్నది పోసానిని కాదట..! పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కోసం ఆ కానిస్టేబుల్ పాత్రను రాసుకున్నాడట పూరి జగన్నాథ్. అందుకే ఆ పాత్రకి మూర్తి అనే పేరును పెట్టాడు. కానీ పూరి జగన్నాథ్ ఆఫర్ ని ఆర్ నారాయణ మూర్తి తిరస్కరించారట. ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆర్.నారాయణమూర్తి వినిపించుకోలేదట. దీనికి గల కారణాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

” జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగాను. ఇక చేస్తే అయిదారేళ్లకు మించి సినిమాలు చేయలేను. ఇలాంటి సమయంలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. ఆ ఉద్దేశంతోనే టెంపర్ సినిమాలోని ఆఫర్ ని వదులుకున్న. పూరి జగన్నాథ్ నాతో ఓ గొప్ప వేషం వేయించాలని అనుకున్నాడు. అంత గొప్ప పాత్రను ఇవ్వాలని అనుకున్న పూరి జగన్నాథ్ కి నా సెల్యూట్. ఎన్టీఆర్ కూడా నన్ను ప్రేమగా అడిగారు. కానీ సున్నితంగా తిరస్కరించాను” అని చెప్పుకొచ్చారు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి.

Advertisement

Read also: రాత్రిళ్ళు తినడానికి అన్నం మంచిదా ? లేక చపాతీలా ? డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే ?

 

Latest Posts

  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!
  • పవన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.. మరో క్రేజీ చిత్రంలో పవన్..!!
  • ఈ జంతువులను కలలో చూస్తే చాలా అదృష్టం..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd