Advertisement
మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల మన ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి తులసి మొక్కను ప్రతిరోజు ఉదయమే తలంటు స్నానం చేసి పూజ చేస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు సూర్యోదయం సమయంలో ఈ మొక్కకు నీరు పోయడం వల్ల మన జీవితంలో సంతోషం ఉంటుందని నమ్ముతారు. కానీ అదే తులసి మొక్కకు నీరు పోయడం మనకు దురదృష్టాన్ని కూడా చేస్తుందని అంటున్నారు. అయితే వారంలో ఈ రెండు రోజులు మాత్రం తులసి మొక్కకు నీరు పెట్టకూడదట.. అవేంటో చూద్దాం.. ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పెట్టరాదు.
also read: Shaakuntalam OTT Release: “శాకుంతలం” OTT విడుదల ఎప్పుడంటే..?
Advertisement
మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క శుభానికి చిహ్నంగా భావిస్తారు. జీవితంలో ఆనందం, సానుకూలత,శ్రేయస్సు తీసుకురావడానికి ప్రతిరోజు ఒక తులసి మొక్కకు నీరు సమర్పించాలని అంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు తల్లి తులసికి ఎంతో ప్రీతిపాత్రమైనదని అంటారు. తులసి తల్లి ఆదివారం విష్ణువు కోసం నీర్జవ్రతాన్ని ఆచరిస్తుంది. కాబట్టి నీటిని సమర్పించడం వల్ల ఆమె ఉపవాసం భంగం అవుతుందని నమ్ముతారు. అందుకే ఆదివారం నీరు సమర్పించకూడదంటారు. అలాగే ఏకాదశి రోజు కూడా తులసికి జలం పోయరాదు.
also read;చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని.. ఇద్దరూ ఇద్దరే!
ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. తల్లి తులసికి కూడా ఈరోజు చాలా ఇష్టం. ఏకాదశి రోజున తులసిజికి శాలిగ్రామ్ లో పెళ్లి జరుగుతుంది. అది ఏకాదశి నాడు తులసి మాత విష్ణువు కోసం నీళ్లు తీసుకోకుండా వ్రతం ఆచరిస్తుంది. కాబట్టి ఏకాదశి నాడు నీరు పోయకూడదని అంటారు. అలాగే ఈ రోజున తులసి ఆకులను కూడా తెంపరాదట. దీని వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదని జీవితంలో ప్రతికూలతలు ఏర్పడతాయని, ఇలా చేయడం వల్ల తులసి మొక్క ఎండిపోతుందని నమ్ముతారు.
Advertisement
also read: