Advertisement
తెలుగు సినీ ఇండస్ట్రీలో మన అభిమాన హీరోలు, హీరోయిన్ల పేర్లను ఇట్టే గుర్తుంచుకుంటాము. వారు కొత్త తారలు అయినప్పటికీ, కేవలం ఒక సినిమాలో నటించిన వారైనప్పటికీ వారి పేర్లను గుర్తుపెట్టుకుంటాము. కానీ ఎంతో కాలం నుండి ఇండస్ట్రీలో ఉండి దాదాపు ప్రతి తెలుగు సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు మాత్రం ఎవరికీ గుర్తు ఉండవు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. వారి పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) కాశీ విశ్వనాథ్.
ఈయన చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. నచ్చావులే సినిమాలో హీరో తండ్రి పాత్రలో, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో కూడా నటించారు.
2) సత్య కృష్ణన్.
సత్య కృష్ణన్ చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు, పిల్ల నువ్వు లేని జీవితం, దూకుడు, బాద్షా వంటి చిత్రాలు ఈమెకి మంచి పేరుని తెచ్చిపెట్టాయి.
3) ప్రదీప్ రావత్.
సై సినిమాలో విలన్ పాత్రలో బిక్షు యాదవ్ గా నటించిన ఈయన మీకు గుర్తుండే ఉంటారు. ఈయన పేరు ప్రదీప్ రావత్.
4) వంశీకృష్ణ.
డార్లింగ్ సినిమా చూసిన వారికి వంశీకృష్ణ గుర్తుండే ఉంటారు. ఈయన కూడా చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
5) భరత్ రెడ్డి.
ఈయన చాలా సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బిజినెస్ మాన్, గంగారం, రాజా ది గ్రేట్ చిత్రాలలో నటించిన ఈయన పేరు భరత్ రెడ్డి.
6) చైతన్య కృష్ణ.
Advertisement
కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ తమ్ముడుగా నటించిన ఈయన మీకు గుర్తుండే ఉంటారు. ఈయన పేరు చైతన్య కృష్ణ.
7) సూర్య కుమార్ భగవాన్ దాస్.
మగధీర, జనతా గ్యారేజ్, చిరుత వంటి హిట్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన పేరు సూర్య కుమార్ భగవాన్ దాస్.
8) గుండు సుదర్శన్.
ఖలేజా, అతడు, ఆంధ్రుడు వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన పేరు గుండు సుదర్శన్.
9) సుప్రీత్ రెడ్డి.
చత్రపతి సినిమాలో కాట్ రాజ్ గా నటించిన ఈయన మీకు గుర్తుండే ఉంటారు. ఈయన రాజమౌళి సినిమాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారూ. ఇతని పేరు సుప్రీత్ రెడ్డి.
10) ఆదిత్య మీనన్.
ఈగ, మిర్చి సినిమాలలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఈయన పేరు ఆదిత్య మీనన్.
11) కెల్లీ డోర్జీ.
డాన్, 1 నేనొక్కడినే, బిల్లా సినిమాలలో విలన్ గా నటించిన ఈయన పేరు కెల్లీ డోర్జీ.
12) రవి ప్రకాష్.
అతడు, ఘర్షణ వంటి చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈయన పేరు రవి ప్రకాష్.
13) శంకర్ మేల్కోటి.
నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి చిత్రాలలో నటించిన ఈయన పేరు శంకర్ మేల్కోటి.
14) పవిత్ర లోకేష్.
రేసుగుర్రం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, టెంపర్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరుని తెచ్చుకున్న ఈమె పేరు పవిత్ర లోకేష్.
15) చంద్రశేఖర్.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి, విక్రమార్కుడు సినిమాలలో నటించిన ఈయన పేరు చంద్రశేఖర్.
Read also: అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన తెలుగు సినిమాల లిస్ట్..!