Advertisement
పూర్వం ఎక్కువగా పెద్దలు చెప్పిన పద్ధతుల్ని పాటించేవారు. రానురాను ఇవి తగ్గిపోతున్నాయి. ఏమైనా వచ్చినప్పుడు మైలు పట్టేవారు. పూర్వం పురుడు లేదంటే ఎవరింట్లో మరణం సంభవించిన మైలు ని పాటించేవారు. ఈ విధానం భారతీయ సనాతన ధర్మంలో ఉంది. ఇప్పుడు మాత్రం పాటించే వాళ్ళు తగ్గిపోయారు. మూఢనమ్మకం అని చాలా మంది కొట్టి పారేస్తున్నారు. అసలు పాటించట్లేదు. పూర్వం ఆచారాన్ని విశ్లేషిస్తే ఒక వాస్తవం వుంది. అదేంటంటే.. ఒక ఇంట్లో శిశువు పుట్టినప్పుడు, ఆ సమయంలో తల్లి గర్భం నుండి కలుషిత వ్యర్ధాలు అంటే నెత్తురు వంటివి వస్తూ ఉంటాయి. అవి వాతావరణం లో అనేక హానికరమైన వైరస్ లకి కారణం అవుతాయి.
Advertisement
Advertisement
ఆ ఇంట్లో బాలింత ఉన్న గదిలో ఆ యజమానికి సంబంధించిన దగ్గరే బంధువులు చూడడానికి వచ్చి అక్కడ ఉండి సహాయం చేస్తారు. అప్పుడు వారిని ఈ వైరస్ అంటుకునే అవకాశం ఉంది. సాధారణంగా వైరస్ జీవన ప్రమాణం పది రోజులు అందుకే 11వ రోజు ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తారు. అక్కడి వస్తువులన్నీ క్రిమిసంహారిని కలిపిన నీటితో శుద్ధి చేయడం జరుగుతుంది. దీనినే పురిటి శుద్ధి అంటారు. మరణించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటిపేర్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఆ సమయంలో ఆ ఇంటి పేరు వారు అక్కడికి వచ్చి వుంటారు.
ఇది కూడా అనేక వైరస్ల కి కారణం అవుతుంది. దాని జీవన ప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయాలని శాస్త్రంలో ఉంది. ఇంటి పేరు కానీ వాళ్ళు నాలుగవ రోజు శుద్ధి చేయమని అంటారు కారణం వాళ్ళు వాళ్ళింటికి వెళ్ళిపోతారు. ఇలా ఈ వైరస్ల కారణంగా మైలు అనేది పట్టడం జరుగుతోంది కానీ చాలామంది దానిని కొట్టి పారేస్తున్నారు నిజానికి పాటించాలి. లేదంటే పలు సమస్యలు ఎదురవ్వచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!