Advertisement
చనిపోయిన ఏడేళ్ళ తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. తెలుగు ఇండస్ట్రీ పై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది. చిత్రంగా ఇండస్ట్రీకి వచ్చి అంతే చిత్రంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మధ్యలో కొన్నేళ్లపాటు ధ్రువతారగా వెలిగిపోయారు. అనుకోని కారణాలు,కొన్ని ఊహించని ఇబ్బందులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్ళు వార్తలు వచ్చాయి. కానీ అవి కారణం కాదు అంటూ ఆ మధ్య ఉదయ్ కిరణ్ అక్క సంచలన ఆరోపణలు చేసింది. కుటుంబ కలహాలతోనే చనిపోయాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి. తన తమ్ముడు కోటీశ్వరుడని తనకి డబ్బుల్లేక చనిపోవాల్సిన కర్మ పట్ట లేదని చెప్పింది.
భార్య విషిత పైనే తమకు అనుమానాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. అయితే వీటిపై ఉదయ్ కిరణ్ భార్య స్పందించలేదు. ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి 11 రోజులు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదని ఉదయ్ అక్క చెప్పింది. అయితే అప్పట్లో విషిత పై ఆరోపణలు చేసినప్పటికీ ఆమె బయటికి రాకపోతే ఉదయ్ కిరణ్ మరణానికి ఆమె కారణం అని అంతా అనుకున్నారు.
Advertisement
అసలు ఇప్పుడు ఉదయ్ భార్య ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఈమె ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. నిజానికి ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకోక ముందు కూడా ఈమె ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయి గా పని చేసేది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.
అయితే సినిమాల్లో అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ఉదయ్ ని బాగు చేయడానికి చాలా ప్రయత్నించిందట విషిత. ఈ విషయం ఆమె సన్నిహితులు కూడా చెబుతుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఉదయ్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఒకానొక సమయంలో ఆయనకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించిదని తెలుగు కాకపోతే తమిళ్ ఇండస్ట్రీ లో చూసుకుందామని అక్కడ 25 వేలు పెట్టి ఒక ఫ్లాట్ కూడా తీసుకుందని చెబుతుంటారు తెలిసినవాళ్లు. ఉదయ్ కోసం ఎంత చేసినా కూడా ఓ రోజు విషిత లేని సమయం చూసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయిన తరువాత కూడా విషిత మరో పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీకెండ్ లో అనాథశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చనిపోయిన భర్తను తలుచుకొని ఇప్పటికీ బాధపడుతున్నట్లు తన సన్నిహితులు చెబుతున్నారు.
Advertisement
also read;
ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?