Advertisement
Nandamuri Taraka Ramarao: సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకపక్క రాజకీయాలతో మరోపక్క సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ దినచర్యకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో అన్నగారి దినచర్య ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం.. ఆయన టైం అంటే టైం అన్నట్లు ఉండేవారు. ఎవరితోనూ అస్సలు ఈ విషయంలో కంపేర్ చేయడానికి కూడా అవదు, అన్నగారు మాత్రం పర్ఫెక్ట్ గా ఉండేవారట. అన్నగారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి వ్యాయామం చేసేవారు. వయసు భయపడిన తర్వాత మసాజ్ చేయించుకుని తర్వాత స్నానం చేసి పూజ చేసుకుని నిర్మాతలతో దర్శకులతో కొత్త కథల గురించి చర్చించేవారు.
Advertisement
వాళ్లతో మాట్లాడుతున్నప్పుడే ఇడ్లీ, ఇడియప్పం వంటివి అల్పాహారం కింద తీసుకునేవారు ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండు నుండి రాత్రి 9 వరకు మరో సినిమాకి పని చేసేవారు. ఇక ఆయన ఆహారపు అలవాట్ల గురించి చూస్తే.. ఇప్పటికే చాలా వార్తలు ఆయన ఆహారపు అలవాట్ల గురించి వచ్చాయి. ఆయన తినే ఆహారం గురించి చాలామంది కథలుగా చెప్తూ ఉంటారు. రాత్రి 8 నుండి 9 లోగా భోజనం చేసి నిద్రపోయేవారు ఉదయాన్నే 24 ఇడ్లీలు తినేవారు. భోజనంలో కచ్చితంగా మాంసాహారం ఉండాల్సిందే. చెన్నైలో ఉన్నప్పుడు భోజనానికి కచ్చితంగా ఇంటికి వెళ్లేవారు.
Advertisement
Also read:
ఎన్టీఆర్ కి ఆపిల్ జ్యూస్ ఉంటే చాలా ఇష్టమట. రోజుకి మూడు నుండి ఐదు బాటిల్స్ ఆపిల్ జ్యూస్ తాగేవారట. వేసవికాలంలో అయితే మరీ ఎక్కువ తాగేవారట. ఎక్కడ షూటింగ్ కి వెళ్లినా సరే ఈ ఆహారపు అలవాట్లలో మాత్రం మార్పు ఉండేది కాదట. వీటిని కచ్చితంగా అనుసరించేవారట. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు తీసుకునే వారట. స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ బజ్జీలు వంటివి తినేవారు. మాంసాహారం అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. నాటుకోడిని బాగా తినేవారట. పెరుగు నెయ్యి కూడా పక్కా తీసుకునే వారట.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!