Advertisement
ఓలా, ఊబర్ వంటివి వంటిది వచ్చిన తర్వాత ఏ సిటీకి వెళ్లినా కూడా సమస్య ఉండడం లేదు. ఈజీగా మనం క్యాబ్ ని బుక్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి వచ్చేయొచ్చు. అయితే ఈ మధ్య ఎక్కువగా రైడ్ క్యాన్సిల్ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు వచ్చేటప్పుడు ఏం చేయాలి..? ఎలా చేస్తే మంచిది అనే విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం. డ్రైవర్లు రైడ్ ని క్యాన్సిల్ చేసినా లేదంటే పికప్ కి రాక పోయినా మనం ఈ విధంగా వ్యవహరించొచ్చు.
Advertisement
మనం క్యాబ్ క్యాన్సిల్ ని చేయకూడదు. డ్రైవర్లు క్యాబ్ పిక్ చేసుకోవడానికి రాక పోయినా లేదంటే వాళ్లే రైడ్ క్యాన్సల్ చేసినా యాప్ లోకి వెళ్లి ఆ క్యాబ్ నెంబర్ కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే టైం, లొకేషన్ వంటి వివరాలని చెప్పి సిటీ ట్రాఫిక్ పోలీసులకి వాట్సాప్ లేదంటే ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఆ క్యాన్సిలేషన్ స్క్రీన్ షాట్ ని కూడా ట్రాఫిక్ పోలీసులకి పంపించండి.
Advertisement
మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 178 ప్రకారం ప్రభుత్వ బస్సులు కనుక రైడ్ ని క్యాన్సిల్ చేస్తే 500 రూపాయలు జరిమానా కట్టాలి అదే ప్రైవేట్ క్యాబ్స్ అయితే 200 రూపాయలను ఆ క్యాబ్ యజమాని నుండి వసూలు చేయడం జరుగుతుంది అయితే క్యాబ్ డ్రైవర్ కి సాయంత్రం లోగా అగ్రికేటర్ నుండి ఆ రోజు రైడ్ ల డబ్బులు జమ అవ్వకపోతే అతడికి ఇబ్బందులు ఎదురవొచ్చు.
అతడికి డబ్బులు ఆరోజు చివర్లోగా వచ్చేలా అగ్రికెటర్లు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ పేమెంట్ చేస్తామని కస్టమర్లు చెప్పినప్పుడు రైడ్స్ క్యాన్సల్ చేసే సమస్య ఇలా తప్పుతుంది. చివరి నిమిషం లో డ్రైవర్లు క్యాబ్ లను క్యాన్సిల్ చేయడం వలన మనకి ఎంతో ఇబ్బంది అవుతుంది. చాలా సార్లు ఇలాంటి పరిస్థితి మీకూ వచ్చే ఉంటుంది. ఒకవేళ కనుక రైడ్ ని క్యాన్సిల్ చేసారంటే ఇలా చేయండి.
Also read:
నా పర్సు కొట్టేసిన దొంగే నా మనసుని కూడా… అసలు ఏం జరిగింది అంటే..?
”నిండుగా కప్పుకున్నా.. అయినా కూడా ఆ చూపులు”… ఈ మహిళా బాధని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!
ఏ తప్పు చేయలేదు.. కానీ 301 రోజులు జైల్లో.. అసలేం అయిందంటే..?