• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Published on March 19, 2023 by karthik

Advertisement

Balakrishna Daughter Tejaswini: నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య. కథానాయకుడిగా మాత్రమే కాదు, నిర్మాత, రచన, దర్శకత్వం లో కూడా ప్రతిభ చూపించారు. స్టూడియో స్థాపించారు. పరిశ్రమకు అండగా నిలిచారు. ఈయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు, ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లే వేరు. మాస్ సినిమాలోకి కేరాఫ్ అడ్రస్ బాలయ్య. అయితే ఇండస్ట్రీలో ఈయనది పెద్ద ఫ్యామిలీ అయినా.. కుటుంబాన్ని మీడియాకు వీలైనంత దూరంగానే ఉంచుతాడు బాలయ్య.

Read also: మరో కొత్త వివాదానికి తెరలేపిన బాలకృష్ణ.. ఈసారి టార్గెట్ అక్కినేని నాగార్జున?

Balakrishna Daughter Tejaswini

బాలయ్యకి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలామందికి ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి మాత్రమే తెలుసు. కానీ ఆయన చిన్న కూతురు తేజస్విని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. వాస్తవానికి బాలయ్య భయపడే ఒకే ఒక వ్యక్తి కూడా ఈమెనే. బాలయ్య ముందు ఎవరైనా కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే ఒక్కటి పీకుతాడు అన్న విషయం మనకు తెలుసు. కానీ బాలయ్య మాత్రం తన చిన్న కూతురు తేజస్వినికి భయపడతారట. ఆమె ఏది చెప్తే అది వింటారట బాలయ్య. ప్రస్తుతం బాలయ్య సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తేజస్విని చూసుకుంటుంది. ఇదివరకు బాలయ్య సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రామ్ లు డాక్టర్ సురేందర్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు తేజస్విని చూసుకుంటుంది.

Advertisement

Balakrishna Daughter Tejaswini

అంతేకాకుండా బాలయ్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజస్వినే నిర్ణయిస్తుందట. తేజస్విని గీతం గ్రూప్ చైర్మన్ భరత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మీద మమకారంతో తేజస్విని ఆయన సినిమాల వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట. గతంలో బాలయ్య సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆయన సతీమణి వసుంధర చూసుకునేవారని టాక్. కానీ ఇప్పుడు తేజస్వినే చూసుకుంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో పాటు బాలయ్య సినిమా వ్యవహారాలను చూసుకుంటూ హైదరాబాద్ లోనే ఉంటుంది. త్వరలోనే తేజస్విని సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడతారనే టాక్ నడుస్తుంది. “ఆదిత్య 999” తో ఆమెను నిర్మాతగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisement

Read also: వివాహాలకు వెళ్ళినప్పుడు ప్రతి యువకుడికి, యువతికి అడిగే ప్రశ్న !

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd