Advertisement
బంగాళాదుంప చిప్స్ నే క్రిస్పీ అని అంటుంటారు. ఎందుకంటే ఇవి తినడానికి కరకరలాడుతుంటాయి. బంగాళదుంపని సన్నని లేయర్ గా కట్ చేసి నూనెలో వేయిస్తారు. లేదా ఒవేన్ లో కాల్చినా చిప్స్ లాగా మారతాయి. వీటికి కొద్దిగా ఉప్పు, కారం జత చేసి తింటే చాలా రుచిగా ఉంటాయి. జార్జ్ క్రమ్ ఈ టేస్టీ ఫుడ్ ని కనిపెట్టారు. ఈయన 1824లో జార్జ్ స్పెక్ కు జన్మించారు. ఆయన హురాన్ ప్రజలలో సభ్యుడైన ఒక ఆఫ్రికన్ అమెరికన్.
Advertisement
జార్జ్ క్రమ్ 1853లో న్యూయార్క్‌లోని సరాటోగా స్ప్రింగ్స్‌లోని మూన్స్ లేక్ హౌస్ రెస్టారెంట్‌లో చెఫ్ గా పని చేసాడు. ఓ సారి బంగాళాదుంప ఫ్రై చేసి వడ్డించినప్పుడు.. ఓ కస్టమర్ దానిని రిటర్న్ పంపించేశాడు. ముక్కలు చాలా మందంగా ఉన్నాయి అంటూ పేర్కొన్నాడు. అయితే.. జార్జ్ తిరిగి ఆ వంటకాన్ని వండడానికి ట్రై చేసాడు. అయితే.. ఈసారి అనుకోకుండా చాలా సన్నగా తరిగాడు. అంత సన్నగా కట్ చేసినా ఆ కస్టమర్ స్పందించలేదు. చిరాకు పడ్డ జార్జ్ ఆ బంగాళా దుంపని చిన్న లేయర్ తరహాలో కట్ చేసాడు.
Advertisement
వాటిని ఫోర్క్ తో తినడానికి వీలు లేకుండా క్రిస్ప్ డిస్క్ లా కనిపించే విధంగా నూనెలో డీప్ ఫ్రై చేసాడు. ఈ క్రంచీ బంగాళదుంపని చూసి కస్టమర్ ఫుల్ ఖుష్ అయ్యాడట. దీనితో ఇతర కస్టమర్లు కూడా అవే కావాలని కోరారట. అలా ఆలూ చిప్స్ పుట్టుకొచ్చాయి. జార్జ్ క్రమ్ ఇవి పాపులర్ అవడంతో తన సొంతంగా రెస్టారెంట్ తెరిచాడు. ఈ ఆలూ చిప్స్ ను తన మెనూ లో ఉంచాడు. అవి అత్యంత ప్రజాదరణ పొందాయి.
1800ల చివరలో, విలియం టాపెండెన్ వంటి వ్యాపారవేత్తలు, కిరాణా దుకాణాల్లో బంగాళాదుంప చిప్‌లను అందుబాటులో ఉంచడానికి కంపెనీలను స్థాపించడం ప్రారంభించారు. వాస్తవానికి, దుకాణాల్లో విక్రయించే చిప్‌లను పెద్ద పీపాలు లేదా గాజు పాత్రలలో ఉంచి తూకం లెక్కన అమ్ముతారు. వీటిని క్రంచీగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి సెల్లోఫేన్ బ్యాగ్‌లు మరియు గ్లాసిన్ బ్యాగ్‌లను రూపొందించారు. అలాగే 1920లలో మెకానికల్ పొటాటో పీలర్ మరియు కంటిన్యూస్ ఫ్రయ్యర్లను కనుక్కున్నారు.
మరిన్ని..
నీరజను వెంకటేష్ ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే?
ఈ సినిమాను చిన్నపిల్లలతో కలిసి చూడకూడదట.. ఎందుకు ఇలా అన్నారంటే?
Bhagath Singh: భగత్ సింగ్ చెప్పిన ఈ ఆఖరు మాటలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..!