Ads
Actress Suryakantham Family and Husband: సూర్యకాంతం పేరు వినగానే ఆమె తెరపై కనిపించగానే కోడంట్రికం పెట్టే గయ్యాళి అత్త, రాచి రంపాన పెట్టే మారుటి తల్లి, కన్న కూతురుపై ప్రేమ, అభిమానాలతో అడుగులకు మడుగులోత్తే తల్లి కళ్ళ ముందు కదలాడుతుంది. రొటీన్ పాత్రలకు ఎప్పటికప్పుడు కొత్త మసాలాలు, కొంగొత్త మేనరిజాలు జతచేస్తూ, మాటలతో, మాట విరుపులతో హాస్యం, వ్యంగ్యం, చిలిపితనం, పొగరు మోతుదనం, జానదనం, గయ్యాళితనం తగు పాళ్లలో కనిపించేలా చేసి ఆ పాత్రకు వన్నె తేవడం ఆమెకే చెల్లింది.
READ ALSO : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. టెన్షన్లో ఫ్యాన్స్.. డాక్టర్స్ ఏమన్నారంటే!
Advertisement
సూర్యకాంతం పుట్టిన ఊరు కాకినాడ కాగా, అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని వివాహం చేసుకొని కొన్ని రోజులు చెన్నై నగరంలో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆమె చివరి శ్వాస వరకు ఇక్కడే ఉన్నారు. సూర్యకాంతం 1924 సంవత్సరంలో తన కెరీర్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాల పాటు తన సినీ ప్రస్థానంలో ఎన్నడూ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కాగా సూర్యకాంతం భర్త మద్రాస్ హైకోర్టు జడ్జి అయినప్పటికీ ఆమె కోసం స్టూడియోల ముందు వేచి ఉండేవారు అంటే ఆమె గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బతికించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
READ ALSO : మీరు పుట్టిన రోజు బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు