Advertisement
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచి అధికార వైసీపీ మరియు ప్రతిపక్షాల మధ్య పోరు కొనసాగుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? అని చర్చలు హోరాహోరీగానే సాగుతున్నాయి. అయితే.. ఈ అంశంపై చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్ధ ప్రజల అభిప్రాయాలతో కూడిన సర్వేను నిర్వహించింది. అయితే.. ఈ సర్వేలో టీడీపీ-జనసేన కూటమి వలన భారీ లాభాలు ఉన్నట్లు తేల్చి చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న 175 సీట్లపై తాము కొన్నిరోజులుగా సర్వే జరిపామని.. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చెబుతూ ఓ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది.
Advertisement
ఈ ఫలితాల ప్రకారం టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయడం వలన 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అధికార వైసీపీ పార్టీ 42 నుంచి 55 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకునే అవకాశం లేదని పేర్కొంది. మొత్తంగా పద్దెనిమిది సీట్ల వద్ద మాత్రమే తీవ్ర స్థాయిలో పోరు కనిపిస్తోందని పేర్కొంది. ఈ మూడు పార్టీలు కాకుండా మిగతా పార్టీలను లెక్కలోకి తీసుకుంటే.. మూడు నుంచి నాలుగు స్థానాలు ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.
Advertisement
ఈ సర్వేలో జిల్లాల వారీగా ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లలో ఎనిమిది టీడీపీ-జనసేన కూటమికి వస్తే.. రెండు సీట్లు వైసీపీకి రానున్నాయి. విజయనగరంలోని తొమ్మిది సీట్లలో టీడీపీ జనసేనకు నాలుగు, వైసీపీకి నాలుగు సీట్లు వస్తే.. ఒక సీటు వద్ద మాత్రం గట్టి పోటీ ఉంటుంది. విశాఖ లోని పదిహేను సీట్లలో టీడీపీ-జనసేనకు పదకొండు సీట్లు వస్తే.. వైసీపీ కి రెండు సీట్లు రానున్నాయి. తూర్పు గోదావరి లోని పందొమ్మిది సీట్లలో పదహారు సీట్లు టీడీపీ-జనసేన కూటమికి వస్తే.. వైసీపీకి రెండు సీట్లు వస్తాయని, ఓ సీటు వద్ద మాత్రం గట్టి పోటీ ఉండబోతోందని పేర్కొంది. ఇక పశ్చిమ గోదావరి వద్ద ఉన్న పదిహేను సీట్లలో వైసీపీ కి రెండు, టీడీపీ-జనసేనకు పన్నెండు సీట్లు వస్తే.. ఓ సీటు వద్ద పోరు ఉండబోతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Read More:
ఈ దేవతల గురించి తెలుసా? తిరుమల సంపాదనని కాపాడే దేవతలు వీరేనట!
డాక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా.. ఈ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అంటారు.. కానీ తన భర్త?