Advertisement
Akkineni Family: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం” శ్రీ సీతారామ జననం”. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం..ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. ఆ తర్వాత కన్నుమూసారు.
ఇకపోతే అసలు విషయంలోకి వెళితే, అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా అందరి పేర్లకి ముందు నాగ అనే పదం ఉంటుంది. అలా వారి పేర్లలో నాగ కలిసి ఉండడానికి గల కారణం ఏంటో తాజాగా నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు వారి అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట. దాంతో ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారట.
Advertisement
అలా నాగార్జున, నాగ చైతన్య పేర్ల ముందు కూడా నాగ అనే పదాన్ని యాడ్ చేశారట. ఇకపోతే అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదేంటి అన్న విషయాన్నికొస్తే, ఆ పేరును కూడా నానమ్మ సూచించారట. అదే విధంగా నాగార్జున సోదరి సుశీల పేరులో కూడా నాగ అన్న పదం యాడ్ చేయడంతో ఆమె పేరు నాగసుశీలగా మార్చుకుందట. అయితే మొదట నాగచైతన్య పేరుని చైతన్య అని నామకరణం చేయడంతో ఆ తర్వాత పెద్దావిడ సూచన మేరకు నాగ అనే పదం యాడ్ చేయడంతో మొత్తం నాగచైతన్య పేరుని యాడ్ చేశారట. అలా అని చైతన్య పేరు కాస్త నాగచైతన్యగా మారిపోయింది. అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదు అన్న విషయానికి వస్తే, ఒకసారి బిగ్ బాస్ షో లోను ఇదే విషయం ప్రస్తావించారు.
Advertisement
Read also: క్రికెటర్లకు నిర్వహించే యో యో టెస్ట్ అంటే ఏంటి ? అసలు దీన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా..?