Advertisement
కరెంటు అంటే తెలియని వారు ఉండరు. కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి. మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. పక్షులకు మనుషులకు ఉన్న తేడా ఏమిటి..? ముఖ్యంగా కరెంట్ లో ఫేజ్ మరియు న్యూట్రల్ అనే అనేవి ఉంటాయి.
Advertisement
వైర్స్ లో విద్యుత్ పాస్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇక రెండవది సర్క్యూట్. ఇందులోంచి కరెంటు పాస్ అవ్వాలంటే ఆ సర్క్యూట్ కంపల్సరిగా క్లోజ్ చేసి ఉండాలి. ఇక మూడవది రెసిస్టెన్స్. అంటే విద్యుత్ నిరోధకం. కరెంటు ఎప్పుడైనా సరే తక్కువ రెసిస్టెన్స్ ను ఉన్న దానిగుండా మాత్రమే ప్రవహిస్తుంది. మనం నిశితంగా గమనిస్తే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాని నుంచి మాత్రమే కరెంటు ప్రవహిస్తుంది. ఇక పక్షుల విషయానికి వస్తే వాటికి షాప్ తగలక పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది పక్షి తన రెండు కాళ్లను ఒకే తీగ పై పెట్టి నిలిచి ఉంటుంది.
Advertisement
అంటే సర్క్యూట్ క్లోస్ కాలేదు. దీనిలో కరెంట్ పాస్ కాదు. ఒకవేళ పక్షి పొరపాటున తన రెండో కాలుతో కానీ రెక్కతో కానీ పక్కనున్న మరో వైర్ ను తాకితే సర్క్యూట్ క్లోజ్ చెయ్యి కరెంటు పక్షి గుండా పాస్ అవుతుంది. అప్పుడు పక్షికి కచ్చితంగా కరెంట్ షాక్ వస్తుంది. ఇక రెండవ కారణం రెసిస్టెన్స్. కరెంటు తీగ పై ఉన్న పక్షి రెసిస్టెన్స్. మరియు ఆ వైరు కు ఉన్న రెసిస్టెన్స్ తో పోల్చుకుంటే ఖచ్చితంగా పక్షి యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పక్షి ఎప్పుడూ తక్కువ డిస్టెన్స్ ఉన్న దాని గుండానే ప్రవహిస్తుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండడంవల్ల పక్షికి షాక్ కొట్టదు.