• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

Published on December 16, 2022 by karthik

Advertisement

సనాతన హిందూ సాంప్రదాయంలో చతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు.. అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ.. బ్రాహ్మణులు అనడం సమచితం. బ్రాహ్మణులు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండేవారు. నలుగురికి జ్ఞానామార్గం బోధించేవారు. అయితే మనం చూస్తూనే ఉంటాం.. బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అంతేకాదు.. వీరిలో చాలామంది ఉల్లిపాయను, వెల్లుల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోరు. ఇవి శరీరానికి చాలా మేలు చేసేవే అయినప్పటికీ చాలామంది బ్రాహ్మణులు వీటిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే వారు ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు తినరు? ఇది వాళ్లకు నియమమా? ఆచారమా? మూఢనమ్మకమా?..

Read also: ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

Advertisement

నిజానికి ఉల్లి, వెల్లుల్లి పదార్థాలలో వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే వీటినుంచి ఎక్కువగా వాసన వస్తుంటుంది. ఇలాంటి పదార్థాలను సాత్విక ఆహారం కింద పరిగణించరు. బ్రాహ్మణులు సాత్విక ఆహారం తప్ప ఇతర పదార్థాలను ముట్టుకోరు. ఒకప్పుడు పుదీనా కూడా ఎక్కువగా వాసన ఉండడంతో వాటికి కూడా దూరంగా ఉండేవారు. కానీ కాలక్రమేనా ఈ అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఒక కోరా యూజర్ తన తాతల కాలం నాటి ఓ సంఘటనను పంచుకున్నారు. 1950 – 60 ప్రాంతంలో ఒక తాతగారు, మామ్మగారు మంచాలు వేసుకొని ఆరు బయట పడుకున్నారు.

అర్ధరాత్రి ఓ దొంగ మామ్మగారి మెడలో ఉన్న గొలుసు కాజేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆవిడ ఒక్కసారి ఉదుటున లేచి కూర్చుని “ఉల్లిపాయ కంపు కొడుతున్నావురా* ఈ గొలుసు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో ” అని అరిచి మెడలోంచి గొలుసు తీసి దొంగ మొహాన కొట్టింది. ఆ గొలుసు తీసుకుని దొంగ పరిగెత్తుతుండగా మామ్మగారి అరుపుకి లేచిన వాళ్ళు దొంగని పట్టుకోవడం జరిగిపోయింది. ఇంతటి వాసన వస్తుంటాయి కనుకే ఉల్లిపాయ, వెల్లుల్లిని బ్రాహ్మణులు నిషేధిస్తారు. నోట్లోంచి వెలువడే వాసన దూషితమైతే ఆ వాసనతో పాటు వెలువడే మంత్రాలు, పూజలు శుద్ధత కోల్పోతాయని విశ్వసించేవారు.

Advertisement

Read also: ఈ సినిమాలు చేసి ఉంటే ఉదయ్ కిరణ్ తిరిగి నిలదొక్కుకునేవాడు!

Latest Posts

  • క్రిటికల్ గానే తారకరత్న పరిస్థితి.. మెలేనాతో సతమతం.. ఏంటీ వ్యాధి?
  • వివేకా హత్యకేసు.. సీబీఐ దూకుడుతో మిస్టరీ వీడేనా?
  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!
  • అనసపండు ఆరోగ్యానికి రక్ష.. ఇన్ని సమస్యలకు చెక్..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd