Advertisement
చాలామంది పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. మన ఊర్లో మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉంటుంటాయి. చాలామంది శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు అయితే చాలా దేవుళ్ళు వైకుంఠం సముద్రం, స్వర్గం వంటి ప్రదేశాల్లో ఉంటారు. శివుడు మాత్రం స్మశానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని స్మశానంలో పాతి పెట్టడం లేదా కాల్చి వేయడం చేస్తారు. ఉదయం ఆ ప్రదేశంలోకి ఎవరు వెళ్ళరు రాత్రులయితే ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎన్నో మంచి ప్రదేశాలను వదులుకుని శివుడు ఎందుకు స్మశానంలో ఉంటాడు దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని చూద్దాం.
Advertisement
ఈ విషయాన్ని మహాభారత అనుషాసనపర్వం 141 అధ్యయనంలో వివరించబడి ఉంది శివుడుని ఉమాదేవి ప్రశ్నిస్తుంది అపవిత్ర స్థానంలో ఎందుకుంటున్నారని..? దానికి పరమశివుడు దేవి నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్ర స్థలం ఎక్కడ ఉందా అని వెతుకుతూ వున్నాను. ఈ స్మశానానికి మించిన మంచి ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించలేదు అందుకే స్మశానంలో ఉంటున్నాను నా భూత గుణ గణాలు ఇక్కడే ఉంటాయి కనుక నేను ఈ ప్రదేశంలో ఉంటాను అని శివుడు చెప్తారు. అపవిత్ర ప్రదేశం కాదు ఇదే నాకు స్వర్గం అని చెప్తాడు.
Advertisement
Also read:
శివుడు ఇది వీరుల నివాసి స్థలం. కపాలాలతో నిండి ఉండే ఈ భయంకరమైన ప్రదేశం నాకు అందంగా కనబడుతుంది. మధ్యాహ్నం సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు దీర్ఘాయుష్షు కోసం పూజ చేసేవారు అపవిత్ర పాపపు పనులు చేసే మగవారు స్మశానంలోకి వెళ్ళకూడదు అంటారు. శివుడు ఇంకా చెప్తూ నా ఆజ్ఞ లేకుండా భూత గణాలు ఎవరికి ఏ హాని తలపెట్టమని అంటారు. మానవులకు క్షేమం కోరేవాడిని కాబట్టే నా భూత గణాలను స్మశానం దాటి బయటకు పోనివ్వనని అంటారు. లోకరక్షణ కోసమే ఈ భీకర రూపం దాల్చానని పరమశివుడు చెప్తారు. శివుడు విష్ణువు ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న రూపాలు మానవ సహజ స్వభావాలకు ప్రతీకులుగా నిలిచారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!