Advertisement
మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం దొరకదు. మరి ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… శాకాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసాహారంతో పోల్చి చూస్తే శాఖాహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. అలాగే మాంసం వినియోగం పెరిగే కొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కనుక చాలామంది ఇప్పుడు శాకాహారులు కింద మారిపోతున్నారు. పైగా ఈ శాఖాహారం తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన దేశంలో దాదాపు 40 శాతం పైగా మంది శాకాహారులే.
Advertisement
మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైన సరే తినడానికి అవ్వదు. రిషికేష్ గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి, మోక్షం కోసం చాలామంది ఇక్కడికి వెళుతూ ఉంటారు. నగరం చుట్టూ ముళ్ళ చెట్లు, పచ్చని కొండలు ఉన్నాయి. దేవతల భూమిగా దీనిని పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసిలో కూడా మాంసాహారం దొరకదు. ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ అన్ని రకాల ఆహారం దొరుకుతుంది.
Advertisement
Also read:
స్వచ్ఛమైన శాఖాహారం మాత్రమే ఇక్కడ తింటారు. పవిత్ర గంగా నది ఒడ్డున హరిద్వారా ఒక ప్రశాంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా ఉంది ఇక్కడ కూడా శాఖాహారం మాత్రమే దొరుకుతుంది. అలాగే అయోధ్య ఉత్తరప్రదేశ్ లో కూడా శాఖాహారం మాత్రమే ఉంటుంది. పలిటానా గుజరాత్ లో కూడా శాకాహారమే తీసుకుంటారు. శాకాహారుల స్వర్గధామం అని ఈ ప్రదేశాన్ని పిలుస్తారు. ఈ ప్రదేశంలో నివసించే చాలామంది జనులను కఠినమైన శాఖాహారులుగా పిలుస్తారు. బృందావన్ ఉత్తరప్రదేశ్ లో కూడా మనకి పూర్తి శాకాహారమే దొరుకుతుంది. మధుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం ఇది. మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. అలానే తిరుమలలో కూడా శాఖాహారం మాత్రమే దొరుకుతుంది. కొండపై ఉన్న తిరుమలలో కూడా పూర్తిగా మాంసాహారం నిషేధం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!