• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!

గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!

Published on March 14, 2023 by karthik

Advertisement

మురుగదాస్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా 2005లో విడుదలైన గజినీ మూవీ తమిళంతో పాటు తెలుగులోను సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటు హీరో సూర్యను, అటు మురగదాస్ ను సౌత్ అంతట బాగా పాపులర్ చేసింది. ఈ చిత్రానికి సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ గజినీ మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లోనే ఒక క్లాసిక్ మూవీ గా నిలబెట్టాయి. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు. ఆసిన్ కథానాయక కాగా.. హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకువెళ్లాయి.

Read also: మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా ?

మతిమరుపు అనే కాన్సెప్ట్ తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించవచ్చు అని మురగదాస్ నిరూపించాడు. ఈ చిత్రంలో నయనతార కూడా తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాను 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. మృగదాస్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని మహేష్ బాబుకు ఈ కథను వినిపించారట. కానీ హీరో ఒంటినిండా పచ్చబొట్లతో కనిపించాలని అనడంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత అజిత్ కి ఈ కథ వినిపించగా ఓకే చెప్పి షూటింగ్ కూడా ప్రారంభించారట. కానీ అజిత్ కు నిర్మాతకు మధ్య విభేదాల కారణంగా సినిమాని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కు చెప్పారట. కానీ వీరిద్దరూ పలు కారణాలతో ఈ చిత్రాన్ని వదులుకున్నారు. దాంతో మురుగదాస్ తమిళ నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసి కమల్ కి చెప్పారట.

Advertisement

కానీ కమల్ కూడా నో చెప్పేసారట. ఇక ఆ తర్వాత రజినీకాంత్, విజయ్ కాంత్, దళపతి విజయ్, శింబు, మాధవన్, సల్మాన్ ఖాన్, విక్రమ్, అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, మోహన్ లాల్ ఇలా పలువురు స్టార్ హీరోలకు చెప్పారట. ఇలా అందరూ ఈ కథను రిజెక్ట్ చేసిన క్రమంలో సినిమా తీయడం అంత అవసరమా? అని ఓ దశలో మురుగదాస్ భావించారట. ఇక చివరి ప్రయత్నంగా అప్పుడప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకు ఈ కథను చెప్పారట. దీంతో సూర్య సంతోషంతో ఇలాంటి కథ కోసమే చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మురగదాస్ కి ఓకే చెప్పేశారట. అలా సంవత్సరంలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ చిత్రం 2005 సెప్టెంబర్ 29న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ విధంగా 13 మంది స్టార్స్ వదులుకున్న సినిమా సూర్యను స్టార్ గా చేసింది.

Advertisement

Read also: అన్న నరేష్ మామూలోడు కాదు బాబోయ్..! నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd