Advertisement
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ! సినిమాతో టాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు. అయితే.. ఈ సినిమా తరువాత జాంబిరెడ్డి, కల్కి వంటి సినిమాలతో డిఫరెంట్ జోనర్స్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాగా నెక్స్ట్ లెవెల్ లో టాక్ తెచ్చుకుంది. మంచి పేరు, కీర్తి తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమా వచ్చింది. ఈ యూనివర్స్ లో ఇదే మొదటి సినిమా. ఈ యూనివర్స్ లో మొత్తం పన్నెండు సినిమాలు ఉండనున్నాయట. హనుమాన్ కాకుండా మిగతా పన్నెండు సినిమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
హనుమాన్ అనేది ఓ సూపర్ హీరో సినిమా. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జనవరి పన్నెండున సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను నిర్మాత కేవలం ముప్పై కోట్ల బడ్జెట్ తోనే నిర్మించాలని అనుకున్నాడు. కానీ, అనుకోకుండా అరవై కోట్ల బడ్జెట్ వరకు వెళ్ళిపోయింది. కానీ, ఈ సినిమా విజయాన్ని చూస్తే.. ఇంత బడ్జెట్ పెట్టిన తప్పులేదు అనిపిస్తుంది.
Advertisement
ఇది ఇలా ఉంటె ప్రశాంత్ వర్మ గతం లోనే సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రస్తావించారు. తన సినిమాటిక్ యూనివర్స్ లో పన్నెండు సినిమాలు రాబోతున్నాయని అన్నారు. ఇందులో భాగం గానే హనుమాన్ సినిమా వచ్చింది. ఓ సామాన్యుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారు. ఇంకా పదకొండు సినిమాలు రానున్నాయి. హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ డివివి దానయ్య కుమారుడు హీరోగా “అధీర” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేవతల రాజు ఇంద్రుడి పవర్స్ ని చూపిస్తారట. ఇక వరుసగా హిందూ గాడ్స్ పవర్స్ ని చూపిస్తూ వస్తారట. అలా మొత్తంగా పన్నెండు సినిమాలు రానున్నాయట. హనుమాన్, అధీర కాకుండా మిగతా సూపర్ హీరోస్ ఎవరు ఉంటారో అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.