Advertisement
ప్రేమకు కులం, మతంతో సంబంధం లేదంటారు. అయితే ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లకు వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఒకప్పుడు పెళ్లిళ్లు, ప్రేమలకు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు పెద్దగా ఉండాలన్న నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు అసలు వయసు గురించి పట్టించుకోవడం లేదు. మనసులు కలిశాయా? లేదా? అన్నది మాత్రమే చూస్తున్నారు. ఆ కుర్రాడి వయసు 25 ఏళ్ళు.. ఆ మహిళ వయసు 55 ఏళ్లు. వయసులో తనకంటే 30 ఏళ్లు పెద్దదైన ఆమెతో ఆ కుర్రాడు ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లపాటు ఆమె కోసం ఎదురు చూశాడు. ఒకరికొకరు బాగా నచ్చడంతో పెద్దలు అంగీకారంతో పెళ్లికి కూడా సిద్ధపడ్డారు. ఈ ప్రేమ కథ ఖజురహ లో పుట్టింది.
Advertisement
Read also: కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!
మధ్యప్రదేశ్ లోని చతుర్పూర్ కి చెందిన షేక్ అమన్ అనే యువకుడు ఖజురహోలోని హస్తకళ దుకాణంలో పనిచేసేవాడు. నాడుగేళ్ల క్రితం ఆ షాప్ కి మార్త జూలియా అనే మెక్సికన్ మహిళ వచ్చింది. ఆమెకి హస్త కళలకు సంబంధించిన సమాచారం గురించి వివరించాడు అమన్. అతడు చెప్పిన విధానం మార్తాకి బాగా నచ్చింది. ఇక ఆరోజు సాయంత్రం అమన్ ఇంటికి వెళుతుండగా ఆ మహిళ అతడికి మళ్ళీ కనపడింది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. తాను భారతదేశంలోని పలు నగరాలు, గ్రామాలను చూడాలనుకుంటున్నట్లు అమన్ తో చెప్పింది. దీంతో అతడు మూడు రోజులు పనికి సెలవు పెట్టి మరి ఆమెకు చుట్టుపక్కల ప్రాంతాలను చూపించాడు. అనంతరం ఆమె మెక్సికో వెళ్ళిపోయింది. ఇక అప్పటినుండి వీరిద్దరూ తరచూ మొబైల్స్ లో మాట్లాడుకునేవారు. 2020లో కరోనా రావడంతో ఆమె భారత్ కి రాలేదు. 2021 లో మాత్రం కేవలం అమన్ ని కలిసేందుకు ఆమె ఇండియాకి వచ్చింది. దాంతో వారి మధ్య స్నేహం మరింత గాఢంగా మారింది.
Advertisement
ఆ తర్వాత ఆమె మళ్ళీ మెక్సికో వెళ్లి 2002లో వచ్చింది. ఇక ఈ ఏడాది పూర్తిగా అమన్ ఇంట్లోనే ఉండి అన్నీ చూసింది. ఇక అమన్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అమన్ ప్రేమకు మార్తా కరిగిపోయింది. ఆమె కోసం అమన్ స్పానిష్ కూడా నేర్చుకున్నాడు. అతనితో పెళ్లికి ఆమె అంగీకరించింది. అంతేకాదు వీరి ప్రేమ వివాహానికి అమన్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఇక వీరిద్దరూ తమ పెళ్లి కోసం కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. అయితే మహిళ విదేశీయురాలైనందున, కుటుంబంతో పాటు ప్రభుత్వ సమ్మతి కూడా అవసరం. షేక్ అమన్, మార్త తమ వివాహ పత్రాలను కోర్టుకు అందించారు. వీరి దరఖాస్తు చూసిన అధికారులు సైతం అవాక్కయ్యారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వివాహానికి కోర్టు అనుమతి ఇవ్వనుంది. అప్పుడు వారి వివాహం భారతీయ చట్టాల ప్రకారం రిజిస్టర్ కానుంది. ప్రస్తుతం వీరి ప్రేమ కథ మధ్యప్రదేశ్ లో వైరల్ గా మారింది.
Read also: మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా ?