Advertisement
వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరిచిపోలేని ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా లేటు వయసులో చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం చాలామంది లైఫ్ లో సెట్ అవ్వాలి. ఆకర్షణీయమైన జీతం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనతో చాలా ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది. వారి సంసార జీవితంపై సరైన దృష్టి పెట్టగలరా.. జీవిత భాగస్వామిని సక్రమంగా తీసుకోగలుగుతారా.. అనేది ప్రధానంగా మారుతోంది. 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు.
Advertisement
దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట. ఎన్నో కలలు కంటూ మీ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం.
Advertisement
కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది. ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి. అప్పుడే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.
also read;
గూగుల్ లో అస్సలు వెతకకూడని ఈ పదాలు గురించి తెలుసా? గూగుల్ సెర్చ్ చేస్తే జైలుకే ..!
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?