Advertisement
ఒక వివాహం దీర్ఘకాలం పాటు కొనసాగాలి అంటే.. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కచ్చితంగా ఆకర్షణ ఉండాలి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులైతే మరింత సంతృప్తికరంగా ఉంటారు. అయితే, సంవత్సరాలుగా ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహాలలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.. ఇలాంటి సమయాల్లో కేవలం ఆకర్షణకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది కుదరదు. దీనితో వైవాహిక జీవితంలో బీటలు వస్తుంటాయి. ఆడవారు తమ భర్తలు ఇచ్చే ప్రాధాన్యతను పోగొట్టుకోకుండా.. వివాహ బంధాన్ని ఎక్కువ కాలం పాటు నిలుపుకోవాలని అనుకుంటే ఈ సూత్రాలను పాటించాలి.
Advertisement
ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండండి. ఉదయం లేచిన వెంటనే కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా చాలా మంది పనులను మొదలు పెట్టేస్తూ ఉంటారు. కొందరు బ్రష్ చేసుకుని రాత్రి వేసుకున్న డ్రెస్ లోనే ఉండిపోతుంటారు. ఇలా కాకుండా.. ఒక్క ఐదు నిముషాలు కేటాయించి స్నానం కూడా ముగించి ఉదయాన్నే మీ భర్తకి టీ లేదా కాఫీ లాంటివి ఇస్తే.. అతనికి ఆ సమయంలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ పట్ల ఆకర్షితం అయ్యేలా చేస్తుంది. ఇక ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడి సామాన్లను అక్కడ వదిలేయకుండా కుదిరినప్పుడల్లా సర్దుకుంటూ ఉండాలి. చూడగానే ఆహ్లాదంగా అనిపించేలా ఇంటిని తీర్చిదిద్దుకునే నేర్పరితనం ఉండాలి.
Advertisement
ఇక పడక గదిని కూడా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుకోండి. మీ గదిలో మీకు అద్భుతమైన అనుభూతులు ఉండేలా చూసుకోండి. ఆ గదిలో మంచి సువాసన వచ్చేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇక విడిచిన దుస్తులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా గదిని శుభ్రంగా ఉంచండి. జాబ్ చేసే మహిళలకు ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు. కానీ మీకు వచ్చే సాలరీలో కొంత మొత్తానికి ఓ మనిషిని ఏర్పాటు చేసుకున్నా మీకు ఇంటిని చక్కదిద్దుకోవడం సులువు అవుతుంది. ఇక శారీరకంగా కూడా మీలో మార్పులను గమనించుకుంటూ ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూనే.. మీరు వేసుకునే దుస్తుల విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. మీ భాగస్వామికి నచ్చే విధంగా రెడీ అవడంలో తప్పు లేదు. మీ భర్తతో సంభాషించేటపుడు మీ మాటతీరుని కూడా గమనించుకుంటూ ఉండండి. గొడవ పడే విధంగా కాకుండా.. సర్దిచెప్పే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ సూత్రాలని పాటిస్తే.. మీ భర్త మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు.
మరిన్ని..
చంద్రబాబు నాయుడుకు జైలులో ఎలాంటి ఆహరం పెడతారు? ఆయనకు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ఏంటంటే?
నగల దుకాణంలో షాకింగ్ చోరీ.. కళ్ళముందే దొంగతనం చేసేసిన కి”లేడీ”లు..!