Advertisement
సంక్రాంతి సందడిలో ఉన్న దేశ ప్రజలకు నేపాల్ విమాన ప్రమాదం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. పైగా పైగా ప్రమాదంలో మన భారతీయులు కూడా ఉండడంతో మరింత కలిచివేసింది. ఖాట్మండు నుంచి పోఖారా వెళ్తున్న ఏటీఆర్-72 విమానం ఆదివారం పోఖారా విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.
Advertisement
విమానం కూలిపోయే సమయంలో అందులో నలుగురు సిబ్బంది, 68 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 68 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒకరు ఐరిష్, ఇద్దరు కొరియన్లు, అర్జంటైనా, ఫ్రెంచ్ జాతీయుడొకరు చొప్పున ఉన్నారు.
నేపాల్ లో విమాన ప్రమాదాలు కామన్ అయిపోయాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఆకస్మిక మార్పుల కారణంగా ఇవి చోటు చేసుకుంటున్నాయి. కొండ ప్రాంతాలు కావడంతో విమానాలు ల్యాండింగ్ చేయడం కష్టంగా మారుతోంది. గత మే నెల 29న జరిగిన ఘటనలో 22మంది చనిపోయారు. 2018 మార్చిలో 51మంది, 2016లో 23 మంది చనిపోయారు.
Advertisement
తాజా ఘటనలో అత్యధికంగా 68 మంది మృతిచెందారు. ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఈ ఘటనకు గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశం నిర్వహించి.. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు విమానం కుప్పకూలిపోవడానికి ముందు తన దిశను కోల్పోయినట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు ఆ విమానం తలక్రిందులవుతున్నట్లుగా ఒరిగిపోవడం కనిపించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ భవనంపై నుంచి ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగాక.. మంటలు, పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.