Advertisement
బుల్లితెర ఆల్ రౌండర్ గా వెలుకొందుతున్న సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన సినిమానే ‘ గాలోడు’. ఇందులో గేహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సాంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మించారు. బీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. అయితే నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్డ్ నమోదయింది.
Advertisement
ఇది ఇలా ఉండగా, నవంబర్ నెల టాలీవుడ్ కి అన్ సీజన్ అంటారు. అందుకే చాలా వరకు నోటబుల్ మూవీస్ ఏవి కూడా పెద్దగా రిలీజ్ అవ్వవు. కానీ ఇదే నెలలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయని విధంగా మూడు హిట్స్ టాలీవుడ్ కి సొంతమయ్యాయి. యశోద ఆల్మోస్ట్ సూపర్ హిట్ గా నిలవగా, మసూద సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 6వ రోజు, కలెక్షన్స్ తో సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాలోడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.
Advertisement
సినిమా 6వ రోజు మార్నింగ్ షోలతో వచ్చిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. అన్ సీజన్ లో నెగటివ్ టాక్ తో వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ ఓల్డ్ ని మాస్ సెంటర్స్ లో కంటిన్యూగా సొంతం చేసుకుని 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవడం మామూలు విషయం కాదని చెప్పాలి ఇప్పుడు. కాగా ఈ ఏడాది టాలీవుడ్ నుండి క్లీన్ హిట్ గా నిలిచిన 18వ సినిమాగా నిలిచింది గాలోడు సినిమా, ఈ నెలలో మిగిలిన సినిమాలకు టాక్ పాజిటివ్ గా ఉండగా, గాలోడు సినిమాకి మాత్రం రెస్పాన్స్ అనుకున్న విధంగా రాకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం హిట్ గీతని దాటడం విశేషం. ఇక లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.
READ ALSO : కొరటాల శివ భార్య ఎవరు…ఆమె గురించి తెలిస్తే, ఫిదా అవ్వాల్సిందే !