Advertisement
కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఇది మీకు తెలుసా? అరేయ్ బుర్ర తక్కువ యెదవా, ఆల్రెడీ రిలీజ్ ఐనా సినిమాని కోవిడ్ లాక్ డౌన్ లో రిలీజ్ అయ్యింది అంటావ్ ఏంటి రా, అని అనుకుంటున్నారా? అవును, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ కోవిడ్ లాక్‌డౌన్‌లో థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా, అయితే ఇండియాలో కాదు బాస్, జపాన్ లో రిలీజ్ అయింది. అవును, మన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ఈ మధ్య జపాన్‌లో విడుదలైంది. అక్కడ కూడా ఫుల్ హౌస్‌ఫుల్ తో రచ్చ రంబోలా చేస్తుంది. అసలు మనకి జపాన్ లో కూడా క్రేజ్ తీసుకొచ్చిన హీరో ఎవరో తెలుసా… ఇంకా ఎవరో మన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే.. ఇవాళ జపాన్‌లోనూ దుమ్ములేపుతున్న మన సినిమాలు గురించి తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : ‘విరాట్ కోహ్లీ’ని ఘోరంగా అవమానించిన ICC
1) రజనీకాంత్ – ముత్తు
జపాన్ లో ఇండియన్ సినిమాకి మార్కెట్ ఓపెన్ చేసిన సినిమా రజనీకాంత్ ముత్తు. అక్కడ రజినీ అంటే పడి చస్తారు.
2) జూనియర్ ఎన్టీఆర్ – బాద్ షా
రజినీకాంత్ తర్వాత జపాన్ లో అంత ఫేమస్ అయింది మన తారకే. అంతే కాకుండా రజినీకాంత్ తర్వాత సినిమా డబ్బింగ్ పొందిన రెండో భారతీయ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. జపాన్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ఎన్టీఆర్ నటించిన బాద్‌షానే. అక్కడ బాగా ఆడింది ఈ మూవీ.
Advertisement
3) ప్రభాస్ – బాహుబలి
బాహుబలి సినిమాతో జపాన్ లో చాలా రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.
4) రామ్ చరణ్ – మగధీర
రామ్ చరణ్ నటించిన మగధీర జపాన్ లో బాగానే ఆడింది.
5) ప్రభాస్ – సాహూ
సాహూ కూడా జపాన్ బాక్సాఫీస్ ని కుళ్ల పొడిచేసింది.
6) నవీన్ పోలిశెట్టి – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా జపాన్ లో ఫుల్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
7) 3 ఇడియట్స్
3 ఇడియట్స్ సినిమా చైనా లో నెం.1 అయినా, జపాన్ లో కొంచెం వెనక పడింది.
8) ఇంగ్లీష్ వింగ్లీష్
లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా జపాన్ లో అదరగొట్టింది.
9) రోబో
రోబో ఇండియా లోన్ కాదు జపాన్ లో కూడా అదరగొట్టింది.
read also : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు !