Advertisement
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లవ్ స్టోరీ మాత్రం చాలామందికి ఎవర్ గ్రీన్ ఫేవరెట్. తన కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని 1955లో పెళ్లి చేసుకున్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్, ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్ మరియు అంజలి జంట.
Advertisement
1990 లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్ పోర్ట్ లో చూసి తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. అంజలి మరియు సచిన్ కలిసి ఓ మూవీ కి వెళ్లారు.
Advertisement
తనను చూస్తే జనం గుమిగూడి తారని థియేటర్ కు లేట్ గా వెళ్ళాడు సచిన్ టెండూల్కర్. అయితే ఇంటర్వెల్ లో సచిన్ ను చుట్టుముట్టేసారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయింది అంజలి. ఆ తర్వాత అంజలి మరియు సచిన్ ఐదు ఏళ్ళు కలిసి డేటింగ్ చేసి… ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న అంజలి పెళ్లి తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసింది. సచిన్ టెండుల్కర్ కుటుంబాన్ని చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది అంజలి. కాగా సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read : ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిలని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!