Advertisement
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్.. తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారని సోషల్ మీడియా ద్వారా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఇద్దరు మగ పిల్లలు పుట్టడంతో వారికి ఉయిర్, ఉలగం అనే పేర్లు కూడా పెట్టినట్లు తెలిపారు. ఇకపోతే కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో మనోహరంగా, ఉజ్వలంగా ఉంది అని, తమ ప్రార్ధనలు పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచి జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు.
Advertisement
ఇదంతా బాగానే ఉంది…కానీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ వివాదంలో చిక్కుకున్నారు. వీరి విషయంపై ప్రముఖ సీనియర్ నటి కస్తూరి దేశంలో సరోగసిని నిషేధించారు అంటూ ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారడమే కాకుండా దానిపై రకరకాల చర్చలు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దీనిపై స్పందించింది.
Advertisement
సరోగసి పై వివరాలను అందజేయాలి అని నయనతార, విగ్నేష్ శివన్ దంపతులకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ నోటీసుల పంపారు. సరోగసి సక్రమంగా జరిగిందా? లేదా? అన్నదానిపై వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై నయనతార దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. నిజానికి మన దేశంలో సరోగసి పద్ధతి అనేది చట్టరీత్యా నేరం. మహిళ గర్భం దాల్చలేని సందర్భంలో తప్ప అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం అనేది నేరం. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.