Advertisement
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చాలా అరుదు. కానీ హీరోయిన్స్ డైరెక్టర్స్ ని చేసుకోవడం మాత్రం కామన్. అందుకే ఎంతో మంది హీరోయిన్లు-డైరెక్టర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు కామనే. హీరోలు, హీరోయిన్స్ మధ్య ఉండే లవ్ స్టోరీలు పెళ్లి వరకు కూడా వెళ్లకుండానే ముగింపు పలికిన సందర్భాలు అనేకం. అయితే కేవలం హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు డైరెక్టర్లు, హీరోయిన్స్ మధ్య కూడా చాలా లవ్ స్టోరీలు నడిచాయి. కొంతమందివి మధ్యలోనే ఆగిపోతే, మరికొంతమందిని మాత్రం పెళ్లి వరకు వెళ్లాయి. అలా డైరెక్టర్లు తో లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
#నయనతార
లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార దర్శకుడు విజ్ఞేశ్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడు సంవత్సరాలు వీరిద్దరూ రిలేషన్ లో ఉండి పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.
# రేవతి
రేవతి కూడా మలయాళం డైరెక్టర్ ఆయన సురేష్ మీనన్ ని 1986లో ప్రేమించి వివాహం చేసుకుంది. తర్వాత 2014లో వీరు విడిపోయారు.
# శరణ్య
శరణ్య మొదట నటుడు సంపత్ దాసుని పెళ్లి చేసుకుంది. మనస్పర్ధల కారణంగా అతనితో విడిపోయి తర్వాత తమిళ్ డైరెక్టర్ పోవన్నం నీ ప్రేమ వివాహం చేసుకుంది.
Advertisement
#రోజా
2002లో రోజా తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే వీరి మ్యారేజ్ అయిపోయింది.
సుహాసిని :
హీరోయిన్ సుహాసిని దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి, వివాహం చేసుకున్నారు
కుష్బూ :
నటి కుష్బూ కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దేవయాని :
నటి దేవయాని రాజ్ కుమార్ అనే దర్శకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో, 2001లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
రమ్యకృష్ణ :
హీరోయిన్ రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.