Advertisement
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమాని మెగాస్టార్ చిరంజీవిని, గరికపాటి నరసింహారావునిి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి మాట్లాడుతుండగా.. చిరుతో ఫోటోలు దిగడానికి చాలామంది మహిళలు, యువతులు స్టేజి పైకి రావడంతో గరికపాటి ఒకింత అసహనానికి గురై ” చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపాలని లేకపోతే నాకు సెలవు ఇప్పించండి” అని చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Read also: గరికపాటి వ్యాఖ్యలపై మొదటి సారి స్పందించిన చిరు ! అయన ఒక…. అంటూ !
Advertisement
మెగా అభిమానులే కాక నాగబాబు తో పాటు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగా భక్తుడైన ఉత్తేజ్, బ్రహ్మాజీ, పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇలా చాలామంది గరికపాటిమీద కౌంటర్లుు వేశారు. అయితే గరికపాటి క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం సద్దుమనడం లేదు. రాంగోపాల్ వర్మ గరికపాటినిని వదిలేలా లేడు. ఇటీవల గరికపాటికి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ పకపకా నవ్వేస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఆ వీడియోలో గరికపాటి నెమళ్ల సంతాన ప్రక్రియ గురించి చెప్పే విధానం, ఆ వీడియోలో నెమళ్లు భిన్నంగా ప్రవర్తించే వీడియోని షేర్ చేశాడు.
ఇక తాజాగా.. అనుష్కను సైతం ఈ వివాదంలోకి లాగాడు. బాబు గోగినేని షేర్ చేసిన ఓ వీడియోని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో గరికపాటి తాను రోజు పేపర్ చదువుతూ ఉండగా.. తన కాళ్ల దగ్గర కూర్చున్న తన కొడుకు పేపర్లో అనుష్క ఫోటోలు చూస్తున్నాడని.. ఆ ఫోటోని చూసి తానే ఆకర్షితుడిని కాగా.. తన కొడుకు ఆకర్షితుడు అవడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదని చెప్తారు. ఆ వీడియోని వర్మ తన ట్విట్టర్లో షేర్ చేసి ” ఓహో, ఆహా, అడ్డేడ్డే” , ” ఓహో మీరు కూడానా బాహు (గరిక) బలి గారు అంటూ ఎద్దేవా చేశారు.
Read also: మహానటి “సావిత్రి” జీవితం నుండి నేర్చుకోవాల్సిన 9 పాఠాలు ఏంటో తెలుసా..?