Advertisement
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా?.. అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తుకు వెళ్లాల్సిందే అన్న భావనలో వైసిపి అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా వైసిపి ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో, ప్రధాన కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Advertisement
Read also: వివేక హత్య కేసుపై సిబిఐకి షర్మిల ఫిర్యాదు? బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు !
అటు విశాఖలో పరిపాలన రాజధాని డిమాండ్ తో జేఏసీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని సీఎం జగన్ ఇప్పటికే వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు” ప్రభుత్వం వర్క్ షాప్ లో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు వెనుకబడి ఉందని.. వారి పనితీరు మెరుగుపరుచుకునేందుకు సమయం ఇచ్చారు. ఇక తాజాగా గురువారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Advertisement
నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక సూచన చేశారు. వైసీపీ నేతలంతా ఇవాల్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయని.. ఇవాల్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళుతున్నామన్నారు. ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి వెళ్లి తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఏపీలో రోజురోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఇప్పటికే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది.
Read also: వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!