Advertisement
MS DHONI : టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పొట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీ లో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్ లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి.
Advertisement
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే కేవలం క్రికెట్ వల్లే కాదు, ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ తీసుకున్న సరే, ధోని సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, అటు బిజినెస్ లు ధోని ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోని కూడా తగ్గేదేలే అన్నట్టుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.
Advertisement
ఇకపోతే క్రికెట్ లో తన రోల్ మోడల్ ఎవరు అనే విషయాన్ని లెజెండరీ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. నా క్రికెట్ రోల్ మోడల్, క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ మాత్రమే. అతనిలా ఆడాలని అందరం అనుకుంటాము. ఆయనలా ఆడాలని ఎప్పుడూ నేను కోరుకుంటాను అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక ధోని వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఎంతోమంది నేటిజెన్లు ఇద్దరూ క్రికెట్ లెజెండ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ధోని రోల్ మోడల్ అయినా సచిన్ టెండూల్కర్ ధోని కెప్టెన్సీ లోనే ఎన్నో ఏళ్ల పాటు టీం ఇండియాకు ఆడాడు అన్న విషయం తెలిసిందే.
READ ALSO : స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం