Advertisement
టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా, సత్యదేవ్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది. అక్టోబర్ 5వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ భాషలలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టుకుంటూ, థియేటర్లలో దూసుకుపోతోంది.
Advertisement
ఇదిలా ఉండగా, ‘గాడ్ ఫాదర్’ కథ సత్యదేవ్ గురించి మార్చారు అంటూ సినిమా రిలీజ్ అయ్యాక ప్రచారం జరిగింది. టాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం అది నిజమే అనేవారు కూడా లేకపోలేదు. సత్యదేవ్ ను ఈ చిత్రం కోసం తీసుకున్నది చిరంజీవి తమ్ముడి పాత్ర కోసమట. ఒరిజినల్ లో టోవీనో థామస్ చేసిన పాత్ర అది. తెలుగులో మాత్రం ఆ పాత్రని లేపేశారు.
Advertisement
అయితే ‘లూసిఫర్’ ప్రాజెక్టు కోసం సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చింది ఈ పాత్ర కోసమే! విలన్ వివేక్ ఒబెరాయ్ పాత్రకు గాను మొదట అరవింద్ స్వామిని సంప్రదించారు. కానీ అతను వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ కు నో చెప్పాడట. అలాగే టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ను కూడా ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు వినికిడి. కానీ హీరోగా ఇంకా రాణిస్తున్న టైం లో విలన్ గా చేయడం అతనికి ఇష్టం లేక తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక యంగ్ హీరోలు ఎవ్వరూ ఈ పాత్ర కు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో సత్యదేవ్ ఆ పాత్రని మార్చేసి విలన్ గా ప్రజెంట్ చేశారట.
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?