Advertisement
చిరంజీవి నటించిన ఆల్ టైం బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొనిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5 న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Advertisement
ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, ఈ మూవీ మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘లూసీఫర్’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ తో పోలిస్తే ఈ మూవీలో చాలా మార్పులు చేశారు. అక్కడ సస్పెన్స్ అనుకున్న ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఒరిజినల్ లో హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉంటుంది. హీరోతో ఆ పాత్రకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా ఉండవు. అయితే ఆ పాత్ర ద్వారా ఒరిజినల్ లో హీరోకి ఓ మాస్ ఎలివేషన్ ఉంటుంది. ‘గాడ్ ఫాదర్’ లో అది మిస్ అయింది.
Advertisement
ఆ పాత్ర ఎందుకు తీసేసారు అని దర్శకుడుని ప్రశ్నించగా, ‘ఒరిజినల్ లో మోహన్ లాల్ పాత్ర 54 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ లో టోవినో థామస్ పాత్ర కొంచెం హీరో స్పేస్ ని ఆక్యుపై చేసినట్లు ఉంటుంది. అందుకే ఆ పాత్రను తీసేసి చెల్లెలి పాత్రకి అన్నయ్య పాత్రని కనెక్ట్ చేసి చిరంజీవి గారి స్క్రీన్ స్పేస్ పెంచాము. ఒరిజినల్ లో మోహన్ లాల్ 54 నిమిషాలు ఉంటారు. ఇక్కడ రెండు గంటల పైగా నిడివి వచ్చేలా చేసాం’ అంటూ దర్శకుడు మోహన్ రాజా చెప్పుకొచ్చారు.
Read Also : ‘గాడ్ ఫాదర్’ లో సత్యదేవ్ పాత్ర వెనుక అంత కథ నడిచిందా!