Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం మన తెలుగు మాసాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. 12 మాసాలలో ఒక్కో మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆషాడ మాసానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి ? అసలు ఆషాడం మాసంలో కొత్తగా పెళ్లయిన జంట ఎందుకు దూరంగా ఉంటారో తెలుసుకుందాం. ఆషాడ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు.
Advertisement
ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేపట్టరు. ముఖ్యంగా అత్తగారింట్లో కోడలిని ఉంచకూడదని భావిస్తారు. ఎందుకంటే ఉత్తరాయన, దక్షిణాయన కథల ప్రకారం ఆషాడమాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళతాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు.
Advertisement
దీంతో ఆషాడంలో కొత్తగా వచ్చిన కోడలిని అత్తగారింట్లో ఉంచకుండా పుట్టింటికి పంపిస్తారు. అయితే ఇదేకాక మరో వాదన కూడా ఉంది.. ఆషాడ మాసంలో అమ్మాయి గర్భం తేలిస్తే మంచిది కాదంటారు. ఆషాడ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణం చల్లబడటం ద్వారా బ్యాక్టీరియా, వైరస్ లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో కొత్త పెళ్లికూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఉంటుందని.. ఆ సమయంలో తల్లి అంటు వ్యాధుల బారిన పడితే కడుపులో బిడ్డపై కూడా ప్రభావం పడుతుందని ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అంతేకాక ఆషాడ మాసంలో అమ్మాయి గర్భం దాలిస్తే ఎండలు ఎక్కువగా ఉండే మే నెలలో డెలివరీ జరుగుతుంది.
విపరీతంగా ఎండలు ఉండడం కారణంగా పుట్టే బిడ్డకు, తల్లికి కష్టాలు తప్పవని ఆషాడ మాసం పేరుతో దూరంగా ఉంచుతారు. దీనివల్ల వారి మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని అంటారు. ఇక చంద్రుడు ఉత్తరాషాడ నక్షత్రం యందు ఉండడం వల్ల ఈ మాసాన్ని ఆషాడం అంటారు. ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధనుస్సు రాశి చివరి వరకు అక్కడే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శూన్యం మాసంలో శుభకార్యాలు చేయరు. ఇక శుక్లపక్ష ఏకాదశి రోజున హిందువులు పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ని వ్యాస పౌర్ణమి అంటారు. ఆషాడ అమావాస్య రోజుల దీపం వెలిగిస్తారు. ఆరోజు సాయంత్రం ఇంటికి నలవైపులా దీపాలు పెట్టడం ఫలప్రదమని భావిస్తారు.
Read also: చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!