Advertisement
తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “గాడ్ ఫాదర్”. ప్రముఖ మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం “లూసిఫర్” ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా. దసరా సందర్భంగా అక్టోబర్ 5 న విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
Advertisement
Read also: KANTARA MOVIE REVIEW : “కంతారా” రివ్యూ..RRR, KGFను మించిపోయిందిగా !
Advertisement
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. గాడ్ ఫాదర్ సినిమా కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాకు ముందుగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకోలేదని.. “సర్వాంతర్యామి” అనే టైటిల్ ని ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు. గాడ్ ఫాదర్ అనే ఈ టైటిల్ తాను చెప్పగానే చిరంజీవికి కూడా నచ్చేసింది అని, సర్వాంతర్యామి అనే టైటిల్ కన్నా గాడ్ ఫాదర్ మరింత బెటర్ గా ఉండడంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారని తమన్ వెల్లడించారు.
ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు, సత్యదేవ్, నయనతార, మురళీమోహన్, సర్వదమన్ బెనర్జీ, సునీల్ ముఖ్యసునీల్ ముఖ్యపాత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమన్ సంగీతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. చిరు ఎలివేషన్స్ కు, ఫైట్స్ కు, ముఖ్యంగా జైల్ ఫైట్, చిరు వర్సెస్ సత్యదేవ్ సీన్స్ కి తమన్ బిజీఏం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read also: పంజాగుట్ట గదికి ఇప్పటికీ అద్దె కడుతున్న త్రివిక్రమ్