Advertisement
సాధారణంగా దర్శకుడు కథ రాసేటప్పుడు ఒక హీరో లేదా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలను రెడీ చేసుకుంటున్నారు.. తీరా కథ రాసుకొని ఆ కథ హీరోకు చెప్పిన సమయంలో వారు అది నచ్చక రిజెక్ట్ చేస్తారు.. దీంతో ఆ కధ మరో హీరో చేసి ఘన విజయం అందుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. ఆ విధంగానే మోహన్ బాబు మరియు చిరంజీవి విషయంలో జరిగింది. ముందుగా మోహన్ బాబు కోసం కథ రెడీ చేసి ఎందుకో ఆయన రిజెక్ట్ చేయడంతో చిరంజీవి చేసి హిట్ కొట్టారు.. మూడు సంవత్సరాలుగా హిట్లు లేకుండా సతమతమవుతున్న చిరంజీవికి ఈ సినిమా జీవం పోసినట్లయింది..
Advertisement
also read:జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించాడని మీకు తెలుసా?
ఆ మూవీయే హిట్లర్.. చిరంజీవి కెరీర్ లోనే హిట్ మూవీగా నిలిచిన హిట్లర్ సినిమాని ముందుగా చిరంజీవితో చేయాలి అనుకోలేదట. మోహన్ బాబు కోసం అనుకున్నారట..ఎందుకో ఇప్పుడు చూద్దాం.. 1996లో మలయాళంలో ఒక సినిమా రూపొందుతోంది. దాని పేరు హిట్లర్.. మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ మూవీ ఇంకా విడుదలకు నోచుకోలేదు.. సినిమా విడుదల అవడానికి వారం రోజుల ముందుగానే తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత ఎడిటర్ మోహన్ నిర్ణయించుకున్నారు. దీనికోసం రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఈ సందర్భంగానే ఇక్కడ సినిమాకు సంబంధించిన సీడీ హైదరాబాద్ కు రాగా నిర్మాత మోహన్ ఆ సినిమాను చూడాలని రైటర్ మద్దూరి రాజాకు చెప్పారట. ఈ సందర్భంలోనే రాజా తన భార్యతో కలిసి ఒక హోటల్ లో సినిమా చూశారట.
Advertisement
ఈక్రమంలోనే మూవీని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారట. దీనికి హీరోగా మోహన్ బాబు ని పెట్టాలని ముందుగా అనుకున్నారట. దర్శకుడిగా ఈవీవీ అని ఫిక్స్ అయిపోయారు.. కథ మోహన్ బాబు కి వినిపించారు. ఆ క్రమంలో మోహన్ బాబు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.. దీంతో మోహన్ బాబు స్థానంలో చిరంజీవి ని ఎంపిక చేశారు. ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసి, దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య, రైటర్ గా శ్రీరామ్ ని తీసుకున్నారు.. ఈ విధంగా చిరంజీవి తో చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయిందని మొహన్ రాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
also read: