Advertisement
T20 World Cup 2022 : టి20 ప్రపంచ కప్ కు ముందు భారత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వేదిస్తున్న గాయాల కారణంగా జట్టుకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పెసర్ జస్ప్రిత్ బూమ్రా దూరం కాగా తాజాగా మరో వికెట్ పడింది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కాలికి ఆపరేషన్ కారణంగా జట్టుకు దూరం అయి, ఆ తర్వాత ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు. ఇదే గాయం వల్ల ఐపీఎల్ 2022 మధ్యలోనే తప్పుకున్నాడు జడ్డూ. మరో ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ దీపక్ చాహార్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్ జట్టులో స్టాండ్ బై గా ఉన్న చాహార్ గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో జట్టులోకి వస్తాడని భావించారు.
Advertisement
read also : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు !
అయితే వెన్ను గాయం కారణంగా అతడు కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో స్టాండ్ బై గా ఉన్న మహమ్మద్ షమీ, శార్దుల్, సిరాజ్ లను ఆస్ట్రేలియాకు పంపాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దీపక్ చాహర్ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించేందుకు సమయం చాలానే పడుతుందని, అతడి వెన్ను సమస్య మళ్ళి తీవ్రమైందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో షమీ, శార్దుల్, సిరాజ్ లను ఆస్ట్రేలియా పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, గాయపడి జట్టుకు దూరమైన బూమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ సీనియర్ అయినా షమీకె ఎక్కువగా ఉంది. అయితే.. జడేజా తరహాలోనే చాహార్ ఐపీఎల్ 2022లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.
Advertisement
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ వరుసగాయాలతో జట్టుకు చాలా కాలంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆర్చర్ 2021 మార్చి నుంచి ఇంగ్లాండు జట్టు తరఫున ఆడలేదు. అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన ఐదో టి20 లో ఆడాడు. ఆ తర్వాత అతను జట్టుకు గాయంతో దూరమయ్యాడు. అలాగే జూలై 2021లో కెంట్ తో తో జరిగిన మ్యాచ్ లో మళ్లీ అతను క్రికెట్ గ్రౌండ్ లో అడుగు పెట్టాడు. అయితే గాయం తిరగబడడంతో మళ్లీ అతను క్రికెట్ కు దూరమయ్యాడు. అర్చర్ 2020 నుంచి వరుస గాయాలతో తరచూ జట్టుకు దూరం అవుతూనే ఉన్నాడు. ఇక 2021 నుంచి అతను గాయాల బెడదతో పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. అతనికి మోచేతి గాయం చాలా తీవ్రంగా ఉండగా, దాన్ని ఆపరేషన్ ద్వారా సరి చేశారు. ఆ తర్వాత అతను తన వేలు గాయంతో మళ్ళీ జట్టుకు మిస్ అయ్యాడు. తాజాగా అతను బ్యాక్ ఫ్రాక్చర్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో టి20 వరల్డ్ కప్ నకు కూడా దూరం అయ్యారు అర్చర్. అటు ఐపీఎల్ 2022లోనూ ఈ ప్లేయర్ ఆడలేదు.