Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే, సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక హీరోతో అనుకోని కథ రాసుకుంటే ఆ కథను మరో హీరో చేయాల్సి వస్తుంది.
Advertisement
ఇండస్ట్రీలో ఇది సహజమే కూడా, సరిగ్గా చిరంజీవి విషయంలో కూడా ఓసారి ఇదే జరిగింది. అదే 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ సినిమా.మలయాళం లో మమ్ముట్టి చేసిన సినిమాకి రీమేక్, అక్కడ ఇది సూపర్ హిట్ మూవీ, పైగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్, అప్పటికే ముత్యాల సుబ్బయ్య కి సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరు కూడా ఉంది. దీనితో ఈ సినిమాకి ఓకే చెప్పేశారు చిరు. సినిమాకి ముందు అంచనాలు కూడా లేవు, కానీ వేటూరి రాసిన నడక కలిసిన నవరాత్రి పాట సినిమా పైన ఒక్కసారిగా అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పాటకి ఇచ్చిండ్రు డాన్స్ కూడా అదిరిపోయింది.
Advertisement
రచయిత ఎల్.బి.శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. అంతొద్దు-ఇది చాలు అన్న డైలాగు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. 42 కేంద్రాల్లో శత దినోత్సవం పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాని ముందుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఈవివి సత్యనారాయణ చేయాలని అనుకున్నారట. కానీ అప్పటికే ఈవివి రెండు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాని వదులుకున్నారు. దీంతో ఈ సినిమా చిరంజీవి చేసి బంపర్ విజయాన్ని అందుకున్నారు.
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?