Advertisement
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. మునుగోడు లో నేతల మొహరింపు వేగవంతమైంది. గల్లీకో నాయకుని చొప్పున మోహరించడంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ముందుందనే చెప్పాలి. మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులను వడ్డేందుకు రెడీ అయిపోయాయి. రాబోయే ఎన్నికల నాటికి ఈ మునుగోడు ఉప ఎన్నిక కీలకం కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ తరపున బరిలో నిలిచారు.
Advertisement
Read also: ఇండస్ట్రీలో భార్యా భర్తలుగా చేసి, ఆ తర్వాత అన్నా చెల్లెలుగా చేసిన జంటలు ఇవే..!
Advertisement
ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతిని బరిలో నిలిపారు. ఇక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వీరికి ప్రత్యర్థిగా బరిలో నిలిపారు. ఇక దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఇక్కడ కూడా విజయం సాధించాలని బిజెపి వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ ఉప ఎన్నిక చేజారితే తమ జాతీయ పార్టీ అంశంపై ప్రభావం పడే అవకాశం ఉందని టిఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీటుని కైవసం చేసుకోవడానికి టిఆర్ఎస్ అభ్యర్థి కూకుంట్ల ప్రభాకర్ ను గెలిపిస్తేతే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూసుకుంట్ల నామినేషన్ కు హాజరైన కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. అంతేకాదు మూడు నెలలకు ఒకసారి మునుగోడుకు వస్తానని, సిరిసిల్లలా మునుగోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ దత్తత ప్రకటనపై సోషల్ మీడియాలో కేటీఆర్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. కేటీఆర్, లేదా కెసిఆర్ దత్తత తీసుకుంటేనే నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారా? అలాంటప్పుడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు టిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాన్నే అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నిస్తుంటే మరికొందరు.. సిరిసిల్ల ఒక్కటే కాదు సార్.. మీరు రాష్ట్రం మొత్తానికి మంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొత్తానికి కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా నేటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు.
Read also: ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు