Advertisement
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో..మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈనెల 7వ తేదీన మొదలైన నామినేషన్లు 14వ తేదీకి ముగిసాయి. ప్రధాన పార్టీల నుంచి టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు.
Advertisement
ఇక తాజాగా టిఆర్ఎస్ పార్టీకి జలక్ ఇస్తూ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పార్టీని వీడారు. ఆయన బిజెపిలో చేరడం లాంచనమే అంటున్నారు. గౌడ సామాజిక వర్గం ప్రభావం మునుగోడులో అధికంగా ఉంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో బూర పార్టీని వేయడంతో దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పనిలో వెంటనే సక్సెస్ అయ్యింది గులాబీ పార్టీ. కొన్నేలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన మాజీ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ గులాబీ గేలానికి చిక్కారు. ఆయన తన భార్య ఎంపీపీ అధ్యక్షురాలు అయినా కళ్యాణితో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
Advertisement
టిఆర్ఎస్ పార్టీకి జలక్ ఇస్తూ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన టిడిపి తరఫున బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయించుకుంది. దీంతో బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. అదే సమయంలో మరో టిఆర్ఎస్ సీనియర్ నేత కర్నే ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎప్పుడూ కెసిఆర్ అవకాశాలు కల్పించలేదు. వేచి చూసి చూసి, ఆయన బిజెపికి వెళ్లాలని అనుకుంటున్నారు. వీరిద్దరూ పార్టీ మారితే మునుగోడులో టిఆర్ఎస్ కు బిసి వర్గాలు దూరం అయినట్లేనన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. ఒక వేళ ఈ ఇద్దరూ బీజేపీ కండువా వేసుకుంటే.. మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని అనుకుంటున్నారు.
read also : నేలపై కూర్చొని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే, వెంటనే డైనింగ్ టేబుల్ ని అవతల విసిరేస్తారు!