Advertisement
మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 7వ తేదీన మొదలైన నామినేషన్లు 14వ తేదీకి ముగిసాయి. ప్రధాన పార్టీల నుంచి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇక ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలు, వ్యక్తులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించారు. ఇందులో భాగంగా నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి : త్రివిక్రమ్ సినిమాల్లో హీరోల చంకల్లో బ్యాగులు ఎందుకు ఉంటాయి?
Advertisement
ఇలా తిరస్కరణకు గురైన నామినేషన్లలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉంది. అయినా కూడా కేఏ పాల్ ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కేఏ పాల్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఓ నామినేషన్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు హోదాలో దాఖలు చేయగా, మరో నామినేషన్ ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేశారు.
ప్రజాశాంతి పార్టీని గుర్తింపు లేని పార్టీగా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు, ఇండిపెండెంట్ హోదాలో దాఖలు చేసిన నామినేషన్ ను మాత్రం అనుమతించారు. ఫలితంగా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా కేఏ పాల్ బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కేఏ పాల్ కు బిగ్ రిలీఫ్ పొందినట్లైంది.
Read also : Nagarjuana : వైరల్ అవుతోన్న నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్